ఈ ఏడాది ఉత్పన్న ఏకాదశి నవంబర్ 14న, 15న? తేదీ, సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి!

 పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కూడా 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెలా శుక్ల పక్షంలో ఒకటి, మరొకటి కృష్ణపక్షంలో మొత్తం 12 నెలల్లో 24 ఏకాదశులు వస్తాయి. అయితే కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజున ఏం చేయాలి?

Published on: Nov 13, 2025, 08:00:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి సంవత్సరం నెలకు రెండు ఏకాదశులు చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఏం చేయాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కూడా 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెలా శుక్ల పక్షంలో ఒకటి, మరొకటి కృష్ణపక్షంలో మొత్తం 12 నెలల్లో 24 ఏకాదశులు వస్తాయి. అయితే కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజున ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్పన్న ఏకాదశి 2025 (Pixabay)
ఉత్పన్న ఏకాదశి 2025 (Pixabay)

ఉత్పన్న ఏకాదశి 2025

ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15న వచ్చింది. ఏకాదశి తిథి నవంబర్ 14 రాత్రి 12:49కి ప్రారంభమై, నవంబర్ 15 తెల్లవారుజామున 2:37కి ముగుస్తుంది.ఈ లెక్కన నవంబర్ 15న జరుపుకోవాలి. ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధించాలి. పురాణాలలో ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. అయితే, ఈ ఏడాది వచ్చే ఈ ఉత్పన్న ఏకాదశి మరింత ప్రాముఖ్యతను కలిగింది.

ఈ ఏకాదశి నాడు పూర్వాషాఢ నక్షత్రం, విష్కంభ యోగం, అభిజిత్ ముహూర్తం కలయిక ఉండడం, పైగా ఈసారి శనివారం రావడం మరో విశేషం. శనివారం నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. దక్షిణావర్తి శంఖంతో అభిషేకం చేసి, తులసి దళాలు, తీయటి ఆహార పదార్థాలు సమర్పిస్తే మంచిది.

నువ్వుల నూనెతో దీపారాధన

శనివారం రావడం వలన శని దేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అన్ని పాపాలు తొలగిపోతాయి, కోరికలన్నీ తీరుతాయి.

ఉత్పన్న ఏకాదశి పూజా విధానం

  1. ఉత్పన్న ఏకాదశి పూజా విధానం గురించి చూస్తే.. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని, విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోని పెట్టి దీపారాధన చేయండి.
  2. ఆ తర్వాత గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి, ఐదు రకాల పండ్లు నైవేద్యంగా పెట్టండి.
  3. దీంతో పాటుగా తులసి మొక్క ముందు దీపారాధన చేయండి.
  4. ఉపవాసం ఉండడం వలన సకల సంపదలు కలుగుతాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. సకల పాపాలు తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. లక్ష్మీదేవి, విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు.
  5. ఈ ఏకాదశి నాడు దానధర్మాలు చేస్తే మరింత ఎక్కువ పుణ్యం వస్తుంది. జీవితంలో ఆనందం కూడా ఉంటుంది.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More