నవంబర్ 17న సూర్యుడు, గురువుల కలయికతో నవపంచమ దృష్టి యోగం.. ఐదు రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు!

నవ పంచమ దృష్టి యోగం ప్రత్యేకమైన యోగం. ఇది సూర్య–గురువుల కలయిక వలన ఏర్పడుతుంది. త్వరలోనే ఈ యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. నవంబర్ 17న సూర్యుడు, గురువు సంయోగం చెందడంతో ఈ నవ పంచమ యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది.

Published on: Nov 12, 2025, 10:00:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఆ శుభ యోగాలు, అశుభ యోగాలు సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఒక్కోసారి శుభ యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి, దాంతో జీవితమంతా ఒక్కసారిగా మారిపోతుంది. నవ పంచమ దృష్టి యోగం ప్రత్యేకమైన యోగం. ఇది సూర్య–గురువుల కలయిక వలన ఏర్పడుతుంది. త్వరలోనే ఈ యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. నవంబర్ 17న సూర్యుడు, గురువు సంయోగం చెందడంతో ఈ నవ పంచమ యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది.

సూర్య–గురువుల సంయోగంతో నవ పంచమ దృష్టి యోగం
సూర్య–గురువుల సంయోగంతో నవ పంచమ దృష్టి యోగం

సూర్యుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లీడర్షిప్, సక్సెస్ వంటి వాటికి కారకుడు. గురువు విజ్ఞానం, అదృష్టం వంటి వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందినప్పుడు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, ఆర్థిక పరంగా బాగుంటుంది, కుటుంబ జీవితం కూడా ఆనందంగా సాగుతుంది.

సూర్య–గురువుల సంయోగంతో నవ పంచమ దృష్టి యోగం.. ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం

1.మేష రాశి

మేష రాశి వారికి నవ పంచమ దృష్టి యోగం బాగా కలిసి వస్తుంది. సూర్య,గురువుల సంయోగంతో ఏర్పడిన ఈ యోగం ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. పని ప్రదేశంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పెండింగ్‌లో ఉన్న టాస్కులను పూర్తి చేస్తారు. పై అధికారుల సపోర్ట్ వస్తుంది. ప్రమోషన్లు పొందుతారు. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. సక్సెస్‌ను అందుకుంటారు. సూర్యుడికి నీటిని సమర్పించడం, గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం వలన ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి.

2.సింహ రాశి

సింహ రాశి వారికి ఈ యోగం అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది. ఈ యోగం ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. మంచి పేరు తెచ్చుకుంటారు. పై అధికారుల సపోర్ట్ ఉంటుంది. విద్యార్థులు సక్సెస్‌ను అందుకుంటారు.

3.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు చేతికే వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. సంతోషం ఉంటుంది.

4.తులా రాశి

తులా రాశి వారికి ఈ యోగం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. అదృష్టం పెరుగుతుంది. పై చదువుల్లో విజయాలను అందుకుంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా ఈ సమయం బాగుంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. అరటి చెట్టుకి గురువారం నాడు నీటిని సమర్పించండి. గురువారం నాడు ఉపవాసం ఉంటే కూడా మంచిది.

5.మీన రాశి

మీన రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. అదృష్టం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తీర్థయాత్రలకు వెళ్తారు. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. రిలేషన్షిప్‌లో ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఆనందం పెరుగుతుంది. గురువారం పసుపు రంగు దుస్తులను దానం చేయండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More