Karthika Pournami: కార్తీక పౌర్ణమి వేళ 3 రాజయోగాల అరుదైన కలయిక, 4 రాశుల జీవితంలో వెలుగులు.. సంపద, ఉద్యోగాలతో పాటు ఎన్నో!

ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ అనేక శుభయోగాలు ఏర్పడడం జరిగింది. దీంతో కొన్ని రాశుల వారికి శుభయోగాల కారణంగా మంచి ఫలితాలు ఎదురవుతాయి. జీవితంలో చాలా మార్పులు ఉంటాయి, అనేక విధాలుగా కలిసివస్తుంది. మరి ఈ శుభయోగాల వేళ ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది?

Published on: Nov 5, 2025, 10:00:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి వేళ విశేషమైన రాజయోగాలు ఏర్పడడంతో ఈరోజు ప్రత్యేకత మరింత పెరిగింది. కార్తీక పౌర్ణమి ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకమైనది. ఈరోజు 365 వత్తులను వెలిగిస్తారు. ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ అనేక శుభయోగాలు ఏర్పడడం జరిగింది. దీంతో కొన్ని రాశుల వారికి శుభయోగాల కారణంగా మంచి ఫలితాలు ఎదురవుతాయి. జీవితంలో చాలా మార్పులు ఉంటాయి, అనేక విధాలుగా కలిసివస్తుంది. మరి ఈ శుభయోగాల వేళ ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

Karthika Pournami: కార్తీక పౌర్ణమి వేళ 3 రాజయోగాల అరుదైన కలయిక (pinterest)
Karthika Pournami: కార్తీక పౌర్ణమి వేళ 3 రాజయోగాల అరుదైన కలయిక (pinterest)

ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ అనేక శుభయోగాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కొన్ని గ్రహాల సంచారంలో మార్పు అనేక విధాలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావితం చేస్తుంది. ద్వాదశ రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. ఈరోజు నవంబర్ 5న చంద్రుడు మేషరాశిలోకి, గురువు కర్కాటక రాశిలో సంచరించడంతో హంస రాజయోగం ఏర్పడింది. అదే విధంగా శని మీన రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. శుక్రుడు తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది మాలవ్య రాజయోగంను ఏర్పరిచింది.

కుజుడు వృశ్చికరాశిలో ఉండడంతో రుచక రాజయోగం ఏర్పడింది. సూర్యుడు, శుక్రుడు కలిసి శుక్రాదిత్య యోగం ఏర్పరిచారు. అలాగే ఈరోజు సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడడం విశేషం. జీవితంలో ఎక్కువ మార్పులు వచ్చినా, కొన్ని రాశుల వారు మాత్రం మరింత ఎక్కువ లాభాలను పొందబోతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం

1.మేష రాశి:

మేష రాశి వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. వ్యాపారస్తులకు ఇది చాలా మంచి సమయం. కొత్త పనిని మొదలుపెట్టడానికి కూడా ఇదే శుభ సమయం.

2.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెద్ద డీల్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే ఛాన్స్ కూడా కనపడుతుంది. అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు ఎక్కువ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే, జీవితంలో చక్కటి మార్పులను చూస్తారు.

3.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఈ రోజు కార్తీక పౌర్ణమి వేళ బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అన్ని రంగాలలో అనేక మార్పులు వస్తాయి. సీనియర్ల సపోర్ట్ ఉంటుంది, దీంతో విజయాలను అందుకుంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు విజయాలను అందుకుంటారు. కష్టానికి తగ్గ ఫలితం చూస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది.

4.మీన రాశి:

ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులు చూస్తారు. కాస్త బద్ధకాన్ని పక్కనపెట్టి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలను పొందుతారు. మొత్తం మీద కార్తీక పౌర్ణమి అన్ని రాశి వారికి కూడా కలిసి వస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More