తులసి మొక్కను ఏ దిశలో పెట్టాలి? ఇలా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు!

వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవుతుంది. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కలనూ కూడా పెడుతూ ఉంటారు. సరైన దిశలో మొక్కలు ఉంటే మంచి జరుగుతుందని, సానుకూల మార్పులను చూడొచ్చని నమ్ముతారు. తులసి మొక్కని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి.

Published on: Nov 10, 2025, 08:00:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ కూడా వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవుతుంది. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కలనూ కూడా పెడుతూ ఉంటారు. సరైన దిశలో మొక్కలు ఉంటే మంచి జరుగుతుందని, సానుకూల మార్పులను చూడొచ్చని నమ్ముతారు. అయితే ఇంట్లో తులసి మొక్క పెట్టేటప్పుడు చాలా మందిలో సందేహం ఉంటుంది. వాస్తు ప్రకారం తులసి మొక్కను ఏ దిశలో పెట్టాలి అని పండితులను అడుగుతూ ఉంటారు.

ఇంట్లో తులసి మొక్క ఏ దిశలో ఉండాలి? (pinterest)
ఇంట్లో తులసి మొక్క ఏ దిశలో ఉండాలి? (pinterest)

సకల శుభాలు కలుగుతాయి

హిందువులకు తులసి మొక్క చాలా ముఖ్యమైనది, పూజ్యమైనది, పవిత్రమైనది. తులసి మొక్కని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి. తులసి మొక్క ముందు దీపారాధన చేసి తులసికి పూజ చేస్తే డబ్బుకి లోటు ఉండదు. తులసిని లక్ష్మీదేవిగా భావిస్తారు. విష్ణువు తులసి ప్రియుడు. విష్ణువుకి తులసిదలాలని సమర్పిస్తే అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇంత ప్రాముఖ్యత కలిగిన తులసి మొక్కని ఇంట్లో ఏ దిశలో పెడితే మంచి జరుగుతుంది, ఏ పొరపాట్లు చేయకూడదు వంటి విషయాలను తెలుసుకుందాం.

ఇంట్లో తులసి మొక్క ఏ దిశలో ఉండాలి?

వాస్తు ప్రకారం తులసి మొక్కను తూర్పు వైపు పెడితే మంచిది. దీని కారణంగా శుభప్రదమైన ఫలితాలను పొందవచ్చు. తులసి మొక్కని తూర్పు వైపు పెట్టడం కుదరకపోతే ఉత్తరం లేదా ఈశాన్యం వైపు పెడితే మంచిది. తులసిని ఇంట్లో ఈ దిశల్లో ఉంచడం వలన సానుకూల ఫలితాలను చూస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది.

తులసి కోటలో ఉండే తులసి ఆకుల్ని కోయకూడదు. చాలా మంది పూజకు తులసి ఆకుల్ని కోసేటప్పుడు తులసి కోట నుంచి సేకరిస్తారు. అలా చేయకూడదు. అలా చేయడం వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరొకండీలు తులసి మొక్కని పెంచి ఆకుల్ని పూజలో వాడుకోవచ్చు.

దక్షిణం వైపు నాటకండి

తులసి మొక్కను పొరపాటున కూడా దక్షిణం వైపు నాటకండి. ఎందుకంటే ఇది పూర్వికుల దిశ. దక్షిణ దిశలో తులసి మొక్కని నాటితే నష్టం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇలా ఆరాధిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. తులసి మొక్కని నిత్యం పూజించాలి. ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క ముందు నేతితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.

తులసి మొక్క విత్తనాలను ఎప్పటికప్పుడు తీసి జాగ్రత్తపరచండి. వాటిని మరోచోట వేస్తే మొక్క వస్తుంది. తులసి దళాలను ఏ రోజు కోయకూడదు. తులసి దళాలను కోసేటప్పుడు మంగళవారం, శుక్రవారం నాడు కోయకుండా చూసుకోండి. మిగిలిన రోజుల్లో కోయవచ్చు. వాటితో పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది, సానుకూల మార్పులను చూడొచ్చు. భగవంతుడి అనుగ్రహంతో దేనికి లోటు ఉండదు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More