ఈరోజే క్షీరాబ్ధి ద్వాదశి.. ఈరోజు ఎందుకు తులసి పూజ చేస్తారు? కారణం తెలుసుకోండి!

ప్రతి ఏటా కార్తీకమాసంలో వచ్చే శుక్ల పక్ష ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశిని జరుపుకుంటాము. ఈ ఏడాది నవంబర్ 2 అంటే ఈరోజు వచ్చింది. ఈరోజు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసికి వివాహాన్ని జరిపిస్తారు. తులసి పూజ ఎందుకు చేయాలి? అసలు తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు? 

Published on: Nov 2, 2025, 12:22:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఏటా కార్తీకమాసంలో వచ్చే శుక్ల పక్ష ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశిని జరుపుకుంటాము. ఈ ఏడాది నవంబర్ 2 అంటే ఈరోజు వచ్చింది. ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈరోజు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసికి వివాహాన్ని జరిపిస్తారు. తులసి పూజ ఎందుకు చేయాలి? అసలు తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు? ఎవరితో పెళ్లి జరుగుతుంది? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

క్షీరాబ్ది ద్వాదశి 2025 (pinterest)
క్షీరాబ్ది ద్వాదశి 2025 (pinterest)

పురాణ కథ

కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు పుడుతుంది. ఆమె తులసీ దేవి. ఆమెను వృందగా పిలుస్తారు. ఆమె జలంధర్ అనే ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకుంటుంది. శివుడు మూడో కన్ను నుంచి వచ్చిన అగ్నిలో పుట్టడం వలన అతనికి ఎక్కువ శక్తులు ఉంటాయి. జలంధరునికి దేవుళ్లు అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ దేవుళ్ళంటే ఎంతో ఇష్టమైన వృందను ప్రేమిస్తాడు. ఆమె విష్ణు భక్తురాలు. ఆ యువరాణితో పెళ్లి అయిన తర్వాత, ఆమె భక్తి పవిత్రత కారణంగా జలంధరుడికి ఇంకా శక్తి పెరుగుతుంది. ఆఖరికి ఈశ్వరుడు కూడా జలంధరుడిని ఓడించలేకపోతాడు. శివుడిని ఓడించి విశ్వానికి అధిపతి అవ్వాలని జలంధరుడు అనుకుంటాడు.

విష్ణువును సాయం

అప్పుడు దేవుళ్ళందరూ విష్ణుమూర్తిని సాయం చేయమని కోరగా, జరిగే నష్టాన్ని అర్థం చేసుకొని విష్ణువు మాయ చేయాలని అనుకుంటాడు. శివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా, జలంధరుడి రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్లి ఆమెను తాకుతాడు. తాను భర్త కాదని ఆమె గ్రహిస్తుంది. దీంతో ఆమె పతివ్రతా నిష్ఠ భగ్నమవుతుంది. జలంధరుడు బలహీనమవుతాడు.

జలంధరుని ఓటమి

నిజం తెలుసుకున్న ఆమె మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది. పూజించిన దేవుడే మాయ చేసాడని ఆమె ఎంతో బాధపడుతుంది. జరిగిన మోసానికి విష్ణువును రాయిలా మారిపోవమని శపిస్తుంది. అప్పుడు విష్ణువు దండకారణ్యంలో సాలిగ్రామ శిలగా మారిపోతాడు. జలంధరుడు శివుడు చేతిలో హతమహతుడవుతాడు. లక్ష్మీదేవి ఆ శాపాన్ని వెనక్కి తీసుకోమని కోరగా, విష్ణువు సాలిగ్రామ రూపాన్ని పెళ్లి చేసుకున్నాక ఆమె పెట్టిన శాపం అంతమవుతుంది. ఇలా విష్ణువుకి ఆమె సతిగా మారుతుంది. ఆమె శరీరం పూర్తిగా కాలిపోయాక తులసి మొక్క పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తోంది.

ద్వాదశ దీపాలు

తులసి కోట దగ్గర ఉసిరి మొక్కను పెట్టి విష్ణుమూర్తిని ఆరాధించాలి. 12, 16, లేదా 21 దీపాలను వెలిగించవచ్చు. ఇలా వెలిగించే దీపాలను "ద్వాదశ దీపాలు" అని పిలుస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More