Dev Uthani Ekadashi: ఈరోజు దేవుత్తాన ఏకాదశి వేళ ఈ ఆరు పనులు చేస్తే పాపాలు తొలగిపోతాయి!

ఈ ఏడాది దేవుత్తాన ఏకాదశి నవంబర్ 1న వచ్చింది. ఈరోజు నుంచి శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు విష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. అప్పుడు శుభకార్యాలు ఆగుతాయి. ఈ నాలుగు నెలల పాటు పితృకార్యాలు జరుపుతారు. ఈరోజు నుంచి అంటే దేవుత్తాన ఏకాదశి నుంచి మళ్లీ శుభకార్యాలు మొదలవుతాయి.

Published on: Nov 1, 2025, 08:00:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా మంది కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు దేవుని ఏకాదశిని జరుపుకుంటాము. ఈ ఏడాది దేవుత్తాన ఏకాదశి ఈరోజు అంటే నవంబర్ 1న వచ్చింది. ఈరోజు నుంచి శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత రోజు తులసి వివాహం చేస్తారు. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు విష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. అప్పుడు శుభకార్యాలు ఆగుతాయి.

ఈరోజు దేవుత్తాన ఏకాదశి వేళ ఈ ఆరు పనులు చేస్తే పాపాలు తొలగిపోతాయి (pinterest)
ఈరోజు దేవుత్తాన ఏకాదశి వేళ ఈ ఆరు పనులు చేస్తే పాపాలు తొలగిపోతాయి (pinterest)

చతుర్మాస్య వ్రత దీక్ష ముగిసాక కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల పాటు పితృకార్యాలు జరుపుతారు. ఈరోజు నుంచి అంటే దేవుత్తాన ఏకాదశి నుంచి మళ్లీ శుభకార్యాలు మొదలవుతాయి. దేవుత్తాన ఏకాదశి నాడు పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ పనులు చేయండి. ఇక అంతా మంచే జరుగుతుంది:

దేవుత్తాన ఏకాదశి నాడు ఇలా చేస్తే ఎంతో మంచి జరుగుతుంది:

  1. ఏకాదశి నాడు విష్ణువుకు పంచామృతాలతో అభిషేకం చేయండి. ఇలా ఈ రోజు చేయడం వలన వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది. నైపుణ్యాలను ప్రదర్శించడానికి కొత్త అవకాశాలను పొందవచ్చు.
  2. ఈరోజు చేసే దానాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పేదవారికి, అవసరమైన వారికి వస్త్రాలు, ఆహారం వంటి వాటిని దానంగా ఇవ్వండి.
  3. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నట్లయితే ఈ ఏకాదశి నాడు తులసి, విష్ణుమూర్తిని ఆరాధించండి. దంపతులు ఇద్దరూ కలిసి ఆరాధిస్తే దాంపత్య జీవితంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవికి, తులసి మాతకు అలంకరణ వస్తువులు సమర్పిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.
  4. ఈ విశేషమైన రోజు భాగవతాన్ని పఠిస్తే కూడా మంచి జరుగుతుంది.
  5. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లయితే, బ్రహ్మముహూర్తంలో విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించండి. తమలపాకులపై “ఓం విష్ణవే నమః” అని రాసి విష్ణు పాదాల దగ్గర పెట్టండి. ఆ తర్వాత రోజు ఈ ఆకును పసుపు వస్త్రంలో పెట్టి భద్రంగా విలువైన వస్తువులు దాచుకునే చోట ఉంచండి.
  6. ఈరోజు రావి చెట్టు కింద నెయ్యితో దీపారాధన చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఆ తర్వాత ప్రదక్షిణలు చేసి విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవిని ఆరాధించండి. విష్ణు, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి పేదరికం నుంచి కూడా బయటపడవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More