ఈ 4 రాశుల వారు 2026లో ఆరు నెలల పాటు రోజూ అదృష్టాన్ని పొందుతారు.. గురువు అనుగ్రహంతో అపారమైన సంపద, కీర్తి!
గురు గ్రహం ఎప్పటికప్పుడు తన రాశిని మారుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జనవరి 2026 నుంచి జూన్ 2026 వరకు ఆరు నెలల పాటు గురువు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతున్నాడు. గురువు పేరు, ప్రతిష్టలు, సంతోషం మొదలైన వాటికి కారకుడు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. అక్టోబర్ 18న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. డిసెంబర్ 5న మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జూన్ 26 వరకు మిధున రాశిలోనే గురువు సంచారం చేస్తాడు. అయితే తిరిగి కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు ఐదు రాశుల వారికి గురువు అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతున్నాడు.

గురువు రాశి మార్పు
గురు గ్రహం ఎప్పటికప్పుడు తన రాశిని మారుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జనవరి 2026 నుంచి జూన్ 2026 వరకు ఆరు నెలల పాటు గురువు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతున్నాడు. గురువు పేరు, ప్రతిష్టలు, సంతోషం మొదలైన వాటికి కారకుడు.
మరి గురు గ్రహం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది? ఆరు నెలల పాటు ఏ రాశి వారు అనేక లాభాలను పొందుతారు? ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
ఆరు నెలల పాటు ఈ రాశులకు విపరీతమైన అదృష్టం.. జీవితమే మారిపోతుంది
1.మిథున రాశి
మిథున రాశి వారికి గురువు కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఆరు నెలల పాటు విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఈ సమయంలో ఆర్థికపరంగా కూడా లాభాలను పొందుతారు. ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్ ఈ సమయంలో మీ చేతికి వస్తుంది. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.
2.వృషభ రాశి
వృషభ రాశి వారికి గురువు కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రమోషన్ రావచ్చు, పెండింగ్‌లో ఉన్న టాస్కులను పూర్తి చేస్తారు. మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఈ సమయంలో మీ పేరు, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.
3.కన్యా రాశి
కన్యా రాశి వారికి గురువు వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు వ్యాపారంలో ఎక్కువ లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు కూడా ఇదే శుభ సమయం. పేరు, ప్రతిష్టలను పొందుతారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
4.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. ఈ ఆరు నెలల పాటు ఈ రాశి వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. కెరీర్‌లో ఊహించని మార్పులు వస్తాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. అన్నీ మీకు కలిసి వస్తాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


