2026లో శని, గురువు, రాహువు, కేతువుల మహా సంచారం.. నాలుగు రాశులకు శ్రేయస్సును కలిగిస్తుంది, సంపద రెట్టింపు అవుతుంది!

త్వరలో మహా సంచారం ఏర్పడనుంది. ఇది చాలా రాశుల వారికి అనేక విధాలుగా శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. 2026 మరో రెండు నెలల్లో వస్తుంది. కొత్త సంవత్సరంలో పెద్ద గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. రాహువు, కేతువు మకర రాశిలోకి, సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. గురువు సింహ రాశిలో సంచారం చేస్తాడు.

Published on: Oct 25, 2025, 12:00:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. ఈ ఏడాది ఇప్పటికే చాలా గ్రహాల సంచారంలో మార్పు చూశాం. వచ్చే ఏడాది కూడా కొన్ని పెద్ద గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. ఇది ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. ఎప్పటికప్పుడు గ్రహాలు వాటి రాశిని మార్చినప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.

2026లో శని, గురువు, రాహువు, కేతువుల మహా సంచారం (pinterest)
2026లో శని, గురువు, రాహువు, కేతువుల మహా సంచారం (pinterest)

రాహువు, కేతువు, శని, గురువుల మహా సంచారం

త్వరలో మహా సంచారం ఏర్పడనుంది. ఇది చాలా రాశుల వారికి అనేక విధాలుగా శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. 2026 మరో రెండు నెలల్లో వస్తుంది. కొత్త సంవత్సరంలో పెద్ద గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. రాహువు, కేతువు మకర రాశిలోకి, సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. గురువు సింహ రాశిలో సంచారం చేస్తాడు. శని 2026 వరకు అదే రాశిలో కొనసాగుతాడు. నక్షత్ర మార్పు అయితే ఉంటుంది.

అలాగే శని అస్తంగతం, ఉదయం, తిరోగమనం కూడా ఉంటాయి. అయితే, ఇలా గ్రహాల సంచారంలో మార్పు ఉండడంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారి జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు ఉంటాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

2026లో మహాసంచారం.. ఈ రాశుల వారికి ఎన్నో లాభాలు

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఈ గ్రహాల సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. సంతోషం ఎక్కువవుతుంది. ఒంటరిగా ఉన్న వారు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. వివాహితులు దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి 2026లో గ్రహ సంచారంలో మార్పు ఉండడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులు చూస్తారు. కెరీర్‌లో ఊహించని మార్పులు ఉంటాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. పిల్లలు సంతోషంగా ఉంటారు.

3.తులా రాశి:

తులా రాశి వారికి 2026లో జరిగే గ్రహ సంచార మార్పు అనేక లాభాలను తీసుకు వస్తుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. వ్యాపారులకు ఇది మంచి సమయం. పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. ఒంటరిగా ఉన్న వారు తోడును పొందుతారు. వివాహితులు వారి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

4.ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి గ్రహాల సంచారంలో మార్పు బాగా కలిసివస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వాహనాలు, ఇల్లు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. వ్యాపారులకు కూడా ఇది శుభ సమయం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More