అక్టోబర్ 23 నుంచి ఆరు రోజుల పాటు ఈ రాశులకు అదృష్టమే, చంద్రుని రాశి మార్పుతో డబ్బు, గృహ, వాహన యోగాలతో పాటు ఎన్నో!
చంద్రుని సంచారంలో మార్పులు కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా కలిసి వస్తున్నాయి. వారిపై ఈ సంచారం ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆశించిన ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా ఉంది. గృహ, వాహన యోగాలు కూడా ఉన్నాయి. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. చంద్రుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర రోజులు సమయం పడుతుంది.

చంద్రుడి రాశి మార్పు
ఈ నెల 23, 24, 25 తేదీల్లో చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత 26, 27, 28 తేదీలలో ధనుస్సు రాశిలో సంచారం చేస్తాడు. చంద్రుడికి నీచరాశి వృశ్చిక రాశిలో సంచారం సమయంలో చంద్రుడిని గురువు వీక్షించడం వలన ఉచ్చబలం కలుగుతుంది. ధనుస్సు రాశిలో సంచారం చేసే చంద్రుడు గురువుతో పరివర్తన చెందుతాడు.
పరివర్తన యోగం
చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు, గురువుకు చెందిన ధనుస్సు రాశిలో చంద్ర సంచారం పరివర్తన యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇలా చంద్రుని సంచారంలో మార్పులు కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా కలిసి వస్తున్నాయి. వారిపై ఈ సంచారం ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆశించిన ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా ఉంది. గృహ, వాహన యోగాలు కూడా ఉన్నాయి. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
చంద్రుని సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి అనేక లాభాలు
1.మేష రాశి:
మేష రాశి వారికి ఈ ఆరు రోజులు పాటు అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తల్ని వింటారు. జీతం పెరిగే అవకాశం ఉంది. ఈ ఆరు రోజుల్లో మీరు చేసే ఏ పనైనా విజయం సాధిస్తుంది. గృహ, వాహన యోగాలు కూడా ఉన్నాయి.
2.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ ఆరు రోజులు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. చంద్రుడిపై కుజ, గురువు దృష్టి పడడంతో మీ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
3.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
4.తులా రాశి:
తులా రాశి వారికి చంద్రుని అనుగ్రహంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో అధికార యోగం కలుగుతుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా ఉంది. ఆదాయం, ఆరోగ్యం రెండూ బాగుంటాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


