నవంబర్ 19 నుంచి ఈ 3 రాశుల సమయం మారుతుంది, సూర్య సంచారంతో డబ్బు, పురోగతి అదృష్టంతో పాటు అనేకం!

గ్రహాలకు రాజు సూర్యుడు కూడా కాలానుగుణంగా తన రాశిని మారుస్తూ ఉంటాడు. ప్రతినెలా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. సూర్యుడు రాశి మార్పు చెందినప్పుడు, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది. శని నక్షత్రంలో సూర్యుడు సంచారం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. 

Published on: Oct 31, 2025, 08:00:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహ సంచారంలో మార్పు వచ్చినప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు కూడా కాలానుగుణంగా తన రాశిని మారుస్తూ ఉంటాడు. ప్రతినెలా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. సూర్యుడు రాశి మార్పు చెందినప్పుడు, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది.

సూర్య నక్షత్ర సంచారంలో మార్పు (pinterest)
సూర్య నక్షత్ర సంచారంలో మార్పు (pinterest)

సూర్యుడు నిర్దిష్ట సమయంలో నక్షత్రాన్ని కూడా మారుస్తూ ఉంటాడు. సూర్యుడు నక్షత్రాన్ని మార్చినప్పుడు, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో రకరకాల మార్పులను తీసుకువస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్యుడు నక్షత్ర మార్పు చెందినప్పుడు కెరీర్, ఫైనాన్స్, వ్యాపారం మొదలైన వాటిపై ప్రభావం చూపిస్తుంది.

సూర్య నక్షత్ర సంచారంలో మార్పు

నవంబర్ 19న సూర్యుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 2 వరకు అనురాధ నక్షత్రంలోనే సూర్యుడు సంచారం చేస్తాడు. అనురాధ నక్షత్రానికి అధిపతి శని. శని నక్షత్రంలో సూర్యుడు సంచారం చేయడం వలన ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ ముఖ్యంగా ఈ రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి.

సూర్య నక్షత్ర సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి అనేక లాభాలు

1.మిథున రాశి:

మిథున రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో కూడా పురోగతిని చూస్తారు. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆఫీసులో కొత్త బాధ్యతను స్వీకరిస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రేమ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలను వింటారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు పడుతుంది. అదృష్టం కూడా మీతోనే ఉంటుంది. ఎప్పటినుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తయిపోతాయి.

3.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం అనేక లాభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో పురోగతిని చూస్తారు. కొత్త ఆదాయం సంపాదిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార పరిస్థితులు కూడా బావుంటాయి. ప్రియమైన వారి సంఖ్య పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషం ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More