2026లో కేతువు ఈ 3 రాశుల వారిని ధనవంతులుగా మారుస్తాడు.. డబ్బుతో పాటు విజయాలు, సంతోషంతో పాటు ఎన్నో
2026లో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఉండబోతోంది. ఈ గ్రహ సంచారాల వలన ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను కూడా పొందుతారు. 2026లో కేతువు సింహ రాశిలో 11 నెలల పాటు సంచారం చేస్తాడు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ ఏడాది మరో రెండు నెలలతో ముగుస్తుంది. 2026లో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఉండబోతోంది. ఈ గ్రహ సంచారాల వలన ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను కూడా పొందుతారు.

సింహ రాశిలో కేతువు
2026లో కేతువు సింహ రాశిలో 11 నెలల పాటు సంచారం చేస్తాడు. 2025 మే 18న కేతువు సింహ రాశిలోకి ప్రవేశించాడు. 2026 డిసెంబర్ వరకు కేతువు ఇదే రాశిలో కొనసాగిస్తాడు. ఈ 11 నెలల కాలంలో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి చూపిస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తి పొందుతారు. విజయాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశుల వారు అనేక లాభాలను పొందుతారు.
కేతువు అనుగ్రహంతో ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్.. అనేక లాభాలు
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి కేతువు సంచారం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. పూర్వీకుల నుంచి ఆస్తి పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది.
కెరీర్‌లో కూడా ఊహించని మార్పులు వస్తాయి. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం. సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మొత్తం మీద ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు.
2.మిథున రాశి
మిథున రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. 11 నెలలు కేతువు సింహరాశిలో సంచరించడంతో శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ప్రశాంతంగా ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి చూపిస్తారు. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. సదుపాయాలు ఎక్కువవుతాయి. ఎక్కువ డబ్బు సంపాదిస్తారు.
3.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. ఈ కాలం మీకు బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్‌ను అందుకుంటారు. విజయాలు కూడా ఉంటాయి. కెరీర్‌లో కూడా ఊహించని లాభాలు పొందుతారు.
వైవాహిక జీవితంలో అపార్థాలు రాకుండా చూసుకోవాలి. ప్రేమ జీవితంపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఉద్యోగంలో మరో అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారాలకు కూడా ఇది శుభ సమయం. ఆదాయం పెరుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


