ఈరోజు కార్తీక సోమవారం వేళ సాయంత్రం ఇలా ఐశ్వర్య దీపం వెలిగిస్తే, శివ కేశవుల అనుగ్రహంతో సిరి సంపదులకు లోటు ఉండదు!

కార్తీక మాసంలో మాంసాహారం ముట్టుకోకుండా నియమ నిష్ఠలతో శివుని ఆరాధిస్తారు. శివ కేశవులను ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అంటారు. ఈ మాసంలో దీపాలు వెలిగిస్తే కూడా పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. కార్తీక సోమవారం నాడు పాలతో ఇలా ఐశ్వర్య దీపం వెలిగిస్తే మంచిది.

Published on: Oct 27, 2025, 12:00:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ప్రత్యేకించి పూజిస్తారు. నెల రోజులు కూడా దీపారాధన, నదీ స్నానాలు ఇలా ఎవరికి నచ్చిన పద్ధతుల్ని వారు పాటిస్తూ ఉంటారు. ఈరోజు మొదటి కార్తీక సోమవారం. ఈరోజు శివుడిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక సోమవారం సాయంత్రం ఇలా ఐశ్వర్య దీపం పెడితే చాలా మంచి జరుగుతుంది.

కార్తీక సోమవారం ఐశ్వర్య దీపం (pinterest)
కార్తీక సోమవారం ఐశ్వర్య దీపం (pinterest)

కార్తీక మాసం

కార్తీక మాసంలో మాంసాహారం ముట్టుకోకుండా నియమ నిష్ఠలతో శివుని ఆరాధిస్తారు. శివ కేశవులను ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అంటారు. ఈ మాసంలో దీపాలు వెలిగిస్తే కూడా పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు, ఉపవాసాలు వంటివి పాటిస్తూ ఉంటారు. వనభోజనాలను కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు.

బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. ఇక ఈరోజు కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం. ఈ సోమవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ ఐశ్వర్య దీపం వెలిగించడం వలన పరమశివుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

కార్తీక సోమవారం నాడు పాలతో ఇలా ఐశ్వర్య దీపం వెలిగిస్తే మంచిది

ఈరోజు రాత్రి క్షీర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది. కార్తీక సోమవారం ప్రదోషకాలంలో ఈ క్షీర దీపాన్ని వెలిగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 మధ్యలో ఈ క్షీర దీపాన్ని వెలిగించుకోవచ్చు. దీనినే ఐశ్వర్య దీపం అని కూడా పిలుస్తారు. ఇక ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో కూడా తెలుసుకుందాం.

ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి?

  1. ముందు ఒక ఇత్తడి పళ్ళెం తీసుకుని దానిపై ఒక తమలపాకు పెట్టండి.
  2. దానిపై ఒక గాజు కప్పులో లేదా వెండి కప్పు పెట్టండి.
  3. ఇప్పుడు ఆ పాత్రలో పాలు పోసి పాత్రకు పసుపు, కుంకుమలు పెట్టాలి.
  4. ఆ పాత్ర చుట్టూ పువ్వులు పేర్చి అందంగా అలంకరించుకోవచ్చు.
  5. ఆ పాలపై నూనె కూడా పోయాలి.
  6. ఆ తర్వాత ఈ పాత్రపై ఒక తమలపాకు పెట్టండి. ఆ తమలపాకుకు పసుపు, కుంకుమలు రాయండి.
  7. ఈ ఆకుపై వత్తులు వేసి వెలిగించండి. (ఆ నూనె పైకి తేలి వత్తులు వెలుగుతాయి)
  8. ఇలా దీపారాధన చేయండి. ఆ తర్వాత “ఓం నమశ్శివాయ” అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More