ఈరోజే కోటి సోమవారం.. శుభ ముహుర్తం, పూజా విధానం, విశిష్టతతో పాటు కోటి యాగాల ఫలితం కోసం ఏం చెయ్యాలో తెలుసుకోండి!

కార్తీకమాసంలో కోటి సోమవారం మరింత విశిష్టమైనది. కోటి సోమవారం నాడు ఆచరించే స్నానం, దానం, ఉపవాసానికి ఎన్నో కోటి రెట్ల ఎక్కువ ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది. కోటి సోమవారం శుభ ముహుర్తం, పూజా విధానం, విశిష్టతతో పాటు కోటి యాగాల ఫలితం కోసం ఏం చెయ్యాలో తెలుసుకోండి.

Published on: Oct 30, 2025, 07:00:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక మాసంలో పరమశివుడుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. కార్తీక మాసంలో సోమవారం రోజున శివుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. కార్తీకమాసంలో కోటి సోమవారం మరింత విశిష్టమైనది. కోటి సోమవారం నాడు ఆచరించే స్నానం, దానం, ఉపవాసానికి ఎన్నో కోటి రెట్ల ఎక్కువ ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది.

ఈరోజే కోటి సోమవారం (pinterest)
ఈరోజే కోటి సోమవారం (pinterest)

ఈ సంవత్సరం కోటి సోమవారం అక్టోబర్ 30న వచ్చింది. అక్టోబర్ 29 సాయంత్రం 5:29కి శ్రవణ నక్షత్రం మొదలై, అక్టోబర్ 30 సాయంత్రం 6:30 వరకు కొనసాగుతుంది. ఈ లెక్కన అక్టోబర్ 30న కోటి సోమవారాన్ని జరుపుకోబోతున్నారు.

కోటి సోమవారానికి ఉన్న విశిష్టత మీకు తెలుసా?

వ్యాస మహర్షి రాసిన స్కంద పురాణం ప్రకారం చూసినట్లయితే, కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం నాడు కోటి సోమవారం అని పిలుస్తారు. శివ కేశవులకు కార్తీకమాసం అంటే ఎంతో ఇష్టం. అందులో కోటి సోమవారం చాలా ప్రత్యేకమైనది, శివకేశవులకు ఎంతో ఇష్టమైన రోజు.

కోటి సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి నది స్నానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. కార్తీక మాసంలో మహావిష్ణువు చెరువులు, నదులు, కాలువల్లో నివసిస్తాడని అంటారు. అందుకని కార్తీక మాసంలో నది స్నానం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది.

కోటి సోమవారం నాడు ఏం చెయ్యాలి?

  1. కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్లి భక్తి శ్రద్ధలతో పంచామృతంతో శివుడికి అభిషేకం చేస్తే చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది.
  2. అలాగే మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేస్తే శివకేశవుల అనుగ్రహం పొందవచ్చు.
  3. శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పించండి. తుమ్మి పూలను కూడా శివుడికి అర్పిస్తే మంచిది.
  4. కొబ్బరికాయ, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి.
  5. సాయంత్రం స్నానం చేసి మహావిష్ణువు ఆలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి.
  6. శ్రీహరికి తులసి మాలను సమర్పించండి.
  7. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది.

ఉపవాసం చాలా మంచిది

కోటి సోమవారం నాడు ఉపవాసం ఉంటే ఎంతో మంచి ఫలితం లభిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. రాత్రి నక్షత్రం దర్శనం చేసుకున్నాక భోజనం చేయాలి.

కోటి యాగాల ఫలితం లభిస్తుంది.

కోటి సోమవారం రోజు ఏదైనా వ్రతాన్ని ఆచరిస్తే ఆ వ్రత ఫలం అనంతమని చెప్తారు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం, సత్యనారాయణ స్వామి వ్రతం వంటివి చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. కోటి సోమవారం నాడు కన్యాదానం చేయడం అశ్వమేధ యాగానికి సమానమైన ఫలితాన్ని ఇస్తుందని స్కంద పురాణంలో చెప్పబడింది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More