పరమశివుడి ప్రత్యేక అనుగ్రహం కలగాలంటే కార్తీక పౌర్ణమి నాడు మీ రాశి ప్రకారం ఈ పరిహారాలను పాటించండి!

కార్తీక మాసంలో శివుని ఆరాధిస్తే, శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. కష్టాలు అన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే పౌర్ణమికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించడం, ప్రత్యేక పూజలు చేయడం వంటివి చేస్తారు. 

Published on: Oct 29, 2025, 08:00:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీకం చాలా విశిష్టమైనది. కార్తీక మాసంలో శివుని ఆరాధిస్తే, శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. కష్టాలు అన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే పౌర్ణమికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించడం, ప్రత్యేక పూజలు చేయడం వంటివి చేస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా విశిష్టమైనదే.

కార్తీక పౌర్ణమి నాడు మీ రాశి ప్రకారం ఈ పరిహారాలను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి (pinterest)
కార్తీక పౌర్ణమి నాడు మీ రాశి ప్రకారం ఈ పరిహారాలను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి (pinterest)

కార్తీక పౌర్ణమి

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శివుడితో పాటుగా లక్ష్మీనారాయణుని కూడా ఆరాధిస్తారు. శివ-కేశవులను కార్తీక పౌర్ణమి నాడు పూజిస్తే, కష్టాలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు, సిరిసంపదలతో సంతోషంగా ఉండొచ్చు అని నమ్ముతారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వచ్చింది. ఈ రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన సంతోషంగా ఉండొచ్చు. కార్తీక పౌర్ణమి నాడు, మీ రాశి ప్రకారం ఏ పరిహారాన్ని పాటిస్తే మంచిదో తెలుసుకోండి.

కార్తీక పౌర్ణమి నాడు మీ రాశి ప్రకారం ఈ పరిహారాలను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి

మేష రాశి:

కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు. ఈ రోజున మేష రాశి వారు శివుడికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. అలాగే శివనామస్మరణ చేయండి. రాగి దీపంలో దీపం వెలిగిస్తే కూడా మీకు కలిసి వస్తుంది.

వృషభ రాశి:

వృషభ రాశి వారు ఈ విశిష్టమైన కార్తీక పౌర్ణమి నాడు శివుని ఆరాధించడంతోపాటు తులసిని కూడా పూజిస్తే మంచిది. ఈ రోజు నెయ్యితో దీపారాధన చేయండి. లలిత సహస్రనామం పఠించండి.

మిథున రాశి:

మిథున రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు భగవద్గీత పారాయణం చేస్తే మంచిది. లేక విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే కూడా బాగా కలిసి వస్తుంది. పేదలకు దానం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే బాగా కలిసి వస్తుంది. “ఓం నమఃశ్శివాయ” మంత్రాన్ని కూడా జపించండి.

సింహ రాశి:

సింహ రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు సూర్య నమస్కారాలు చేయాలి. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే శివాలయంలో దీపాన్ని వెలిగించండి. గోధుమలు, బెల్లం దానం చేస్తే బాగుంటుంది.

కన్యా రాశి:

కన్యా రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు శివుడు మరియు విష్ణువును పూజిస్తే మంచిది. ఈ విశిష్టమైన రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మంచి జరుగుతుంది.

తులా రాశి:

తులా రాశి వారు ఈ కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. దీపదానం చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు శివుడితో పాటుగా సుబ్రహ్మణ్యస్వామిని కూడా పూజించాలి. ఎర్రటి వస్త్రాలు, పప్పు ధాన్యాలు దానం చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం మంచిది. పసుపు రంగు వస్తువులు, శనగలు దానం చేయండి.

మకర రాశి:

మకర రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు శివుడితో పాటు శనీశ్వరుడిని ఆరాధిస్తే మంచిది. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే బాగా కలిసి వస్తుంది.

కుంభ రాశి:

కుంభ రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు వస్త్రాలు లేదా ఆహారం దానం చేయడం మంచిది. శివుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి:

మీన రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు మహావిష్ణువుతో పాటు శివుడిని కూడా పూజించాలి. స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకోండి. పసుపు రంగు స్వీట్లను నైవేద్యంగా పెట్టి, దానం చేయండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More