ఈ చిన్న చిన్న వాస్తు నియమాలను పాటిస్తే.. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో, ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు!

చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన దేనికి లోటు ఉండదు. సమస్యల నుంచి బయటపడచ్చు. వాస్తు దోషాలు కూడా ఏర్పడవు. సంపదకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కూడా ఇంట్లో వాస్తు నియమాలను పాటించాలి. ఈ నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. 

Published on: Oct 28, 2025, 08:00:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాస్తు ప్రకారం పాటించడం వలన చాలా సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన దేనికి లోటు ఉండదు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడచ్చు. వాస్తు దోషాలు కూడా ఏర్పడవు. సంపదకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కూడా ఇంట్లో వాస్తు నియమాలను పాటించాలి. ఈ నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు, దేనికి లోటు ఉండదు.

వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు
వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం, అలంకరణ సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతాయి, లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. ఈ కొన్ని వాస్తు నియమాలను పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండొచ్చు, సంపదకే కొరత ఉండదు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? ఎలాంటి వాస్తు నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు:

1.ప్రవేశద్వారం శుభ్రంగా ఉండాలి:

లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ప్రవేశద్వారం శుభ్రంగా ఉండేటట్టు చూడాలి. దుమ్ము, ధూళి పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ప్రవేశద్వారం బాగుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. లేదంటే లక్ష్మీదేవి గడప బయట నుంచి వెళ్ళిపోతుంది.

2.సాయంత్రం దీపం వెలిగించాలి:

ఇల్లు చీకటిగా ఉండకుండా చూసుకోవాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు చీకటిగా ఉంటే లక్ష్మీదేవి రాదు. అక్కడ పేదరికం ఆహ్వానించినట్లవుతుంది. కాంతి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కనుక దీపాలు లేదా లైట్లు వెలుగుతూ ఉండేటట్టు చూసుకోండి.

3.ముఖద్వారంపై గుర్తులు:

ఇంటి ముఖద్వారం పై స్వస్తిక్ లేదా లక్ష్మీపాదముద్రలు ఉండేటట్టు చూసుకోండి. అలాగే ప్రధాన ద్వారం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేటట్టు చూసుకోవాలి.

తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యకిరణాలు మన ఇంటికి బయపడతాయి. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఉత్తరం కుబేరుడు దిశ. ఇంటి ముఖద్వారం ఉత్తరదిక్కులో ఉన్నట్లయితే శుభ ఫలితాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రధాన ద్వారం ఈ దిక్కులో ఉన్నట్లయితే డబ్బు ప్రవాహానికి అంతరాయం ఉండదు. ఒకవేళ ప్రధాన ద్వారం దక్షిణముఖంగా ఉంటే, హనుమంతుడు ఫోటోను పెట్టండి.

4.పూజ గదిలో:

పూజ గదిలో లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను పెట్టండి. ప్రతిరోజు తాజా పువ్వులు, ధూపం, నైవేద్యాలు సమర్పించండి. పూజ గదిని ఎప్పుడూ సువాసనగా ఉండేటట్టు చూసుకోండి. శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

5.వంటగది:

వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. వంటగది శుభ్రంగా లేకపోయినా లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు. గ్యాస్ స్టవ్‌ను తూర్పు వైపు పెట్టండి. పాత్రలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి.

ఇంటి ఈశాన్యం వైపు వాటర్ ఫౌంటైన్, అక్వేరియం వంటివి పెట్టండి. దీంతో డబ్బు ప్రవాహాన్ని పెంచుకోవచ్చు. ఇంట్లో కుళాయిలు ఎప్పుడూ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా ఈ మార్పులు చేసినట్లయితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More