వాస్తు ప్రకారం ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఏ దిశలో ఉండాలి? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి!

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో ఉన్న వస్తువులను వాస్తు ప్రకారం ఉంచడం వలన వాస్తు దోషాలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే, ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. 

Published on: Nov 08, 2025 1:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో ఉన్న వస్తువులను వాస్తు ప్రకారం ఉంచడం వలన వాస్తు దోషాలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే, ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూల శక్తితో సంతోషంగా ఉండొచ్చు.

వాస్తు ప్రకారం ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఏ దిశలో ఉండాలి? (pinterest)
వాస్తు ప్రకారం ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఏ దిశలో ఉండాలి? (pinterest)

వాస్తు శాస్త్రం ప్రకారం ఈరోజు కొన్ని నియమాలను తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి వంటగదిలో ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్, మైక్రోవేవ్, ఎయిర్ ఫ్రయర్, వాటర్ ప్యూరిఫైయర్ ఇలా చాలా వస్తువులు ఉంటాయి. అయితే వాస్తు ప్రకారం వీటిని ఉంచినట్లయితే ఏ ఇబ్బంది లేకుండా, వాస్తు దోషాలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు.

వాస్తు ప్రకారం ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఏ దిశలో ఉంచితే శుభఫలితాలు ఎదురవుతాయి?

వాస్తు ప్రకారం వాటర్ ప్యూరిఫైయర్‌ని ఇంట్లో పెట్టేటప్పుడు ఉత్తరం వైపు పెట్టడం మంచిది. ఉత్తరం వైపు వాటర్ ప్యూరిఫైయర్‌ని ఉంచడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలా కుదరని పక్షంలో దక్షిణం వైపు పెట్టుకోవచ్చు. కానీ పొరపాటున కూడా వాటర్ ప్యూరిఫైయర్‌ని ఆగ్నేయం వైపు పెట్టడం మంచిది కాదు. అలా చేసినట్లయితే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.

కావాలంటే వంటగదిలో వాటర్ ప్యూరిఫైయర్‌ని పడమర వైపు పెట్టుకోవచ్చు. ఇది వరుణుడి దిశ. ఈ దిక్కులో వాటర్ ప్యూరిఫైయర్‌ని పెట్టడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అదే ఒకవేళ మీరు ట్యూబ్ బోర్ వెల్స్, హ్యాండ్ పంప్స్ వంటివి పెట్టుకోవాలనుకుంటే ఈశాన్యం శుభ దిశ. అండర్ గ్రౌండ్ ట్యాంక్‌లు పెట్టుకోవడానికి కూడా ఇది సరైన దిశ. మైక్రోవేవ్ పెట్టేటప్పుడు ఇంటి ఆగ్నేయం వైపు పెట్టుకోవడం మంచిది. పడమర వైపు పెట్టుకోకూడదు.

ఈ పొరపాట్లు కూడా చెయ్యకండి

  1. ఇక ఇది ఇలా ఉంటే, వాస్తు ప్రకారం టీవీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు వంటి వాటిని ఈశాన్యం వైపు పెడితే మంచిది. పడమర వైపు టీవీ ఉంచడం వలన పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు.
  2. వాస్తు ప్రకారం ఏసీ వంటి వాటిని ఉత్తరం, పడమర వైపు పెడితే శుభ ఫలితాలు ఎదురవుతాయి. టీవీ, కంప్యూటర్ లాంటివి వాస్తు ప్రకారం ఇంట్లో సరిగా పెట్టకపోవడం వలన నష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పిల్లలకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది.
  3. ఫ్రిడ్జ్, ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్, ఓవెన్, వాషింగ్ మిషన్ మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులను తూర్పు, ఆగ్నేయం, పడమర, వాయువ్యం వైపు ఉంచినట్లయితే ఏ వాస్తు దోషము ఉండదు.
  4. జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు లాంటివి కూడా ఈ దిశలో ఉంటేనే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.