మన శంకర వరప్రసాద్ గారులో వెంకటేష్ షూటింగ్ పూర్తి- కేవలం 10 రోజులే- చిరంజీవి, వెంకీ పోస్ట్- డైరెక్టర్ అనిల్ రిప్లై

మెగాస్టార్ చిరంజీవి-డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా మన శంకర వర ప్రసాద్ గారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. దీనికి సంబంధించి వెంకీ పోస్ట్ పెట్టగా. చిరంజీవి రిప్లై ఇచ్చారు. ఈ ఇద్దరి పోస్ట్‌లకు అనిల్ రావిపూడి బదులు ఇచ్చారు.

Published on: Dec 4, 2025, 11:58:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ సినిమాకు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించడం, ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్‌కి బిగ్గెస్ట్ ట్రీట్ కానుంది.

మన శంకర వరప్రసాద్ గారులో వెంకటేష్ షూటింగ్ పూర్తి- కేవలం 10 రోజులే- చిరంజీవి, వెంకీ పోస్ట్- డైరెక్టర్ అనిల్ రిప్లై
మన శంకర వరప్రసాద్ గారులో వెంకటేష్ షూటింగ్ పూర్తి- కేవలం 10 రోజులే- చిరంజీవి, వెంకీ పోస్ట్- డైరెక్టర్ అనిల్ రిప్లై

వెంకటేష్ పార్ట్ పూర్తి

అయితే, తాజాగా విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయిందని తెలియజేశారు. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టారు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కోసం నా భాగం ఈరోజుతో పూర్తయింది. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం. నాకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయనతో స్క్రీన్‌ షేర్ చేసుకోవాలని ఎంతోకాలంగా ఎదురు చూశాను. ఆ అవకాశాన్ని ఈ ప్రత్యేకమైన సినిమాతో ఇచ్చినందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు" అని వెంకటేష్ రాసుకొచ్చారు .

వెంకీకి చిరు రిప్లై

అలాగే, మనం అందరం కలిసి 2026 సంక్రాంతిని థియేటర్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేద్దాం అని వెంకటేష్ అన్నారు. హీరో వెంకటేష్ పెట్టిన పోస్ట్‌కు చిరంజీవి రిప్లై ఇవ్వడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. వెంకటేష్‌కు రిప్లై ఇస్తూ చిరు కూడా స్పెషల్ పోస్ట్ పెట్టారు.

"మై డియర్ వెంకీ మై బ్రదర్.. మనిద్దరం కలిసి పనిచేసిన ఈ పది రోజులు నాకు మెమరబుల్. నీతో గడిపిన ప్రతి క్షణం ఆనందంతో, ఎనర్జీతో నిండిపోయింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి నువ్వు ఇచ్చిన ప్రత్యేకమైన ప్రజెన్స్ అబ్బురపరిచింది. నీతో గడిపిన ప్రతి క్షణం ఎంతో ఆనందం కలిగించింది" అని చిరంజీవి తెలిపారు.

కలలను నిజం చేస్తూ

విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి పోస్టులను కోట్ చేస్తూ తన ఆనందాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా పోస్ట్ పెట్టారు. "కొన్ని కలలు మన మనసులో సంవత్సరాల పాటు దాగి ఉంటాయి. అకస్మాత్తుగా సినిమా అలాంటి కలలను నిజం చేస్తుంది" అని అనిల్ రావిపూడి అన్నారు.

"మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారితో పక్క పక్కన నిలబడి, కలిసి నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ, వారి ప్రత్యేకమైన చార్మ్‌తో మెరిసిన ఆ క్షణం నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందం ఇచ్చింది. నా ప్రయాణంలో ఇది ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మన శంకర వరప్రసాద్ గారు కోసం తన పార్ట్ పూర్తిచేసి, ఈ అందమైన కలను సాకారం చేసిన డియర్ వెంకీ సర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు" అని దర్శకుడు అనిల్ రావిపూడి రాసుకొచ్చారు.

హీరోలు, డైరెక్టర్ పోస్టులతో

ఇలా హీరోలు, డైరెక్టర్ పోస్ట్‌లతో సోషల్ మీడియా ఊపెక్కింది. ఇక హీరోల అభిమానులు వాటిని షేర్ చేయడం, కామెంట్స్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మన శంకర వరప్రసాద్ గారు సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.

హీరోయిన్‌గా నయనతార

కాగా, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవికి జోడీగా బ్యూటిపుల్ నయనతార హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. వీరితోపాటు వీటీవీ గణేష్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More