మంచి కామెడీతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం.. విక్టరీ వెంకటేష్ కల్ట్ క్లాసిక్ హిట్ మూవీ నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్!

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో కల్ట్ క్లాసిక్ హిట్‌గా నిలిచిన సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా చేసిన నువ్వు నాకు నచ్చావ్ థియేటర్లలో మళ్లీ సందడి చేయనుంది. 4కె వెర్షన్‌లో నువ్వు నాకు నచ్చావ్ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి రీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనే వివరాలపై లుక్కేద్దాం.

Published on: Nov 29, 2025, 18:07:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి అయిన “నువ్వు నాకు నచ్చావ్” ఇప్పుడు 4Kలో తిరిగి థియేటర్లలోకి వస్తోంది. ఇది కేవలం రీ-రిలీజ్ కాదు.. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అభిమానుల కోసం ఒక పండుగ అని మేకర్స్ చెబుతున్నారు.

మంచి కామెడీతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం.. విక్టరీ వెంకటేష్ కల్ట్ క్లాసిక్ హిట్ మూవీ నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్!
మంచి కామెడీతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం.. విక్టరీ వెంకటేష్ కల్ట్ క్లాసిక్ హిట్ మూవీ నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్!

కామెడీతో న్యూ ఇయర్

కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి కుటుంబంతో కలిసి నవ్వులు పూయించే, హృదయాన్ని తాకే సినిమా చూడటానికి ఇదే సరైన సమయం అంటూ నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. కొత్త సంవత్సరాన్ని మంచి కామెడీతో ఆహ్వానించడానికి రెడీగా ఉండండంటూ పేర్కొన్నారు.

నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్

2026 జనవరి 1న నువ్వు నాకు నచ్చావ్ సినిమా రీ రిలీజ్ కానుంది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా 4కె వెర్షన్‌లో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ అవనుంది. అయితే మొదట ఈ సినిమా ఆస్ట్రేలియా, యూరప్, UK వంటి దేశాల్లో విడుదల కాలేదు. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

డైరెక్టర్ త్రివిక్రమ్ కథ

అక్కడి తెలుగు ప్రేక్షకులు 25 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ అనుభూతిని ఇప్పుడు థియేటర్‌లో ఆస్వాదించనున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ రాసిన అద్భుతమైన కథను టాలీవుడ్ సీనియర్ దర్శకుడు విజయ భాస్కర్ తెరకెక్కించారు. ఆయన టేకింగ్ వల్లే ఈ సినిమా ప్రతి కుటుంబానికి దగ్గరైంది.

సోషల్ మీడియాలో వైరల్

ఇకపోతే ఈ సినిమాతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానుల సంఖ్య లక్షల్లోకి చేరింది. ఆయన రాసిన అమరమైన డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వెంకటేష్ నటన, హాస్యం, హృదయాన్ని తాకే భావాలు, ఇవన్నీ కలసి ఈ సినిమాను తెలుగు సినిమా అభిమానుల గుండెల్లో నిలిపాయి.

కుటుంబ కథా చిత్రాలకు

శ్రవంతి రవికిషోర్ నిర్మాణంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెలుగు కుటుంబ కథా చిత్రాలకు ఒక ప్రామాణంగా నిలిచింది. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ ఈ సినిమాను 4K లో తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ

నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో హీరోయిన్‌గా బ్యూటిపుల్ ఆర్తి అగర్వాల్ నటించింది. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ మధ్య వచ్చే రొమాంటిక్, కామెడీ సీన్స్ ఎంతగానో అలరించాయి. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అలాగే, గెస్ట్ అప్పిరియెన్స్ ఇచ్చిన ఆశా సైని అలియాస్ ఫ్లోరా సైని గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది.

ఐఎమ్‌డీబీ రేటింగ్

వీరితోపాటు నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ప్రకాష్ రాజ్, ఎమ్ఎస్ నారాయణ, చంద్రమోహన్, సునీల్, బ్రహ్మానందం, సుహాసిని, బాబు మోహన్‌ల నటన, కామెడీ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక నువ్వు నాకు నచ్చావ్ మూవీకి ఐఎమ్‌డీబీలో పదికి 8.8 రేటింగ్ ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More