ఏదో లాభం వస్తుందని శివ రీ రిలీజ్ చేయట్లేదు.. మూవీ చూశాక అమలకు అలా మెసేజ్ పెట్టా.. నాగార్జున కామెంట్స్
టాలీవుడ్ కింగ్ నాగార్జున సూపర్ హిట్ ఫిల్మ్ శివ రీ రిలీజ్ కానుంది. నవంబర్ 14న 4కే డాల్బీ ఆట్మాస్‌లో శివ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియాకు శివ స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. ఈ సందర్భంగా శివ రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో నాగార్జున, దర్శకుడు ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ 'శివ' బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను మార్చేసింది. 'బిఫోర్ శివ', 'ఆఫ్టర్ శివ' అన్నట్లుగా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు.

అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్‌లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా శివ స్పెషల్ ప్రిమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
రాము గారు.. మ్యూజిక్ క్వాలిటీ చాలా బాగుంది. రీ రిలీజ్ కోసం సౌండ్‌లో ఎలాంటి కేర్ తీసుకున్నారు?
-సౌండ్ క్యాలిటీ ఎన్హెన్స్ అయ్యిందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఒరిజినల్‌లో ఉండే ఫ్లేవర్ పోకుండా ఏఐ టెక్నాలజీని వాడి బెటర్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం వర్క్ చేసాము. అది మీ అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది.
నాగార్జున గారు 36 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపించింది?
-36ఏళ్ల తర్వాత రీరిలీజ్‌లో ఇలా కలుస్తామని నేను కలలో కూడా అనుకోలేదు. శివకి ఇంత ఆదరణ కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని కూడా కలలో అనుకోలేదు. రాము అప్పుడు ఎంత ఇష్టపడి ప్రతిదీ కేర్ తీసుకుని చేశాడో రీ రిలీజ్ కోసం కూడా గత ఆరు నెలల నుంచి అంతే ఇష్టంతో వర్క్ చేశారు.
-సౌండ్ అద్భుతంగా వినిపిస్తుంది అని అంటున్నారు. ఇదంత రాము చేసిన ఎఫర్ట్. డాల్బీ అట్మాస్‌కి తగ్గట్టుగా ఈ సౌండ్‌ని రీ క్రియేట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ టీం చాలా అద్భుతంగా చేశారు.
-మీరు చూసి ఎంత ఇంప్రెస్ అయ్యారు మొన్న నేను చూసి అంతే కొత్తగా ఫీలయ్యా. కొత్త సినిమా చూసినట్టుగా అనిపించింది. సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సౌండ్ బాగుందనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఫస్ట్ టైం నేను సౌండ్ బాగుంది అనే టాకు శివ సినిమా కోసం విన్నాను.
-శివ మాకు చాలా పర్సనల్. ఇది 50 ఇయర్స్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. 50 ఇయర్స్ యానివర్సరీ రోజున సినిమాని రీ రిలీజ్ చేయాలనుకున్నాం. నిజానికి పదేళ్ల క్రితమే 4కే చేసాము. అయితే అప్పుడు డాల్బీ జరగలేదు.
-ఇప్పుడు అన్ని హంగులతో ఒక స్పెషల్ అకేషన్‌లో సినిమా రిలీజ్ చేస్తున్నాం. నిజానికి ఇది ఏదో ప్రాఫిట్ వస్తుందని చేయలేదు. సినిమాకి ఏం కావాలో అన్ని ఆర్జీవీ అడిగాడు. మేమిచ్చాం.
నాగార్జున గారు శివ ఒక ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ అవ్వడానికి కారణం ఏమని భావిస్తున్నారు?
-రాము స్ట్రాంగ్ విజన్, కన్వెన్షన్‌తో వచ్చారు. సినిమాని ఇలా కూడా తీయొచ్చని చూపించారు. నేను కూడా చాలా సార్లు ఎందుకు ఇది కల్ట్ సినిమా అయిందని భావిస్తుంటాను. సమ్‌థింగ్ మ్యాజిక్ జరిగింది.
నాగార్జున గారు అమల గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అనిపించింది?
-వెరీ నోస్టాల్జిక్ ఫీలింగ్. సినిమా చూసినప్పుడు అమల ఊర్లో లేదు. couldn't take my eyes off you (నిన్ను చూస్తున్నంతసేపు చూపుతిప్పుకోలేకపోయాను) అని మెసేజ్ పెట్టాను (నవ్వుతూ ) . సినిమా చూస్తున్నంతసేపు ఫెంటాస్టిక్ మెమొరీ, సినిమాలో ప్రతిదీ గ్రేట్ మెమరీ.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


