హీరోని ఎలివేట్ చేయడమే సినిమా పని.. రామ్‌ చరణ్‌ను అలాగే చూపించారు.. బుచ్చిబాబుదే ఈ ఘనత: చికిరి సాంగ్‌పై ఆర్జీవీ రివ్యూ

రామ్ చరణ్ పెద్ది మూవీలోని చికిరి సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాటపై తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రివ్యూ ఇచ్చాడు. ఓ స్టార్ హీరోను ఎలా చూపించాలో బుచ్చిబాబు అలాగే చూపించాడని అతడు అనడం విశేషం.

Published on: Nov 11, 2025, 13:54:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న పెద్ది మూవీ నుంచి ఈ మధ్య చికిరి చికిరి సాంగ్ వచ్చిన సంగతి తెలుసు కదా. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ అభిమానులకు తెగ నచ్చేసింది. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ పాటను ఆకాశానికెత్తాడు. ఓ స్టార్ హీరోను ఎలా చూపించాలో అలా చూపించారని అన్నాడు.

హీరోని ఎలివేట్ చేయడమే సినిమా పని.. రామ్‌ చరణ్‌ను అలాగే చూపించారు.. బుచ్చిబాబుదే ఈ ఘనత: చికిరి సాంగ్‌పై ఆర్జీవీ రివ్యూ
హీరోని ఎలివేట్ చేయడమే సినిమా పని.. రామ్‌ చరణ్‌ను అలాగే చూపించారు.. బుచ్చిబాబుదే ఈ ఘనత: చికిరి సాంగ్‌పై ఆర్జీవీ రివ్యూ

చికిరి చికిరి సాంగ్‌పై ఆర్జీవీ రివ్యూ

చికిరి చికిరి సాంగ్, అందులో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలుసు కదా. ఈ పాటలో ఎటువంటి అనవసర ఆర్బాటాలు లేకుండా ఫోకస్ మొత్తం హీరోపైనే ఉంచేలా డైరెక్టర్ అద్భుతంగా తీశాడని రామ్ గోపాల్ వర్మ అంటున్నాడు. ఈ పాటపై మంగళవారం (నవంబర్ 11) ఉదయం తన ఎక్స్ అకౌంట్ లో ఆర్జీవీ రివ్యూ ఇచ్చాడు. అందులో అతడు ఏమన్నాడో చూడండి.

“డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీలాంటి సినిమాలోని ఏ క్రాఫ్ట్ అయినా వాటి నిజమైన ఉద్దేశం హీరోని ఎలివేట్ చేయడమే. చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ ను చాలా రా, రియల్, ఎక్స్‌ప్లోజివ్ రూపంలో చికిరి చికిరి పాటలో చూశాను. అనవసరమైన మెరుపులు, అర్థంపర్థం లేని భారీ సెట్స్, ఊహకందని ప్రొడక్షన్ డిజైన్ లు, వందల మంది డ్యాన్సర్లు లేకపోతేనే ఓ స్టార్ మెరుస్తాడని అర్థం చేసుకున్నందుకు బుచ్చి బాబు సానాకు అభినందనలు. స్టార్ పైనే ఫోకస్ పెట్టాలన్న నియమాన్ని పాటించావు” అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

చికిరి చికిరి సాంగ్ గురించి..

రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న పెద్ది మూవీ నుంచి ఈ మధ్యే ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటను లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశాడు. నవంబర్ 7న రిలీజైన ఈ సాంగ్.. నాలుగు రోజుల్లోనే నాలుగు కోట్లకుపైగా వ్యూస్ తో రికార్డులు తిరగరాస్తోంది.

ఈ పాటను బాలాజీ రాయగా.. మోహిత్ చౌహాన్ పాడాడు. ఈ పాటలో రామ్ చరణ్ హుక్ స్టెప్ చాలా మందిని ఆకర్షించింది. ప్రోమో వచ్చిన కొద్దిసేపటికే ఎన్నో రీల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ పెద్ది మూవీ వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More