ఏఆర్ రెహమాన్‌తో పనిచేయడం నా చిన్ననాటి కల: రామ్ చరణ్.. తెలుగులో అదరగొట్టిన జాన్వీ కపూర్.. వీడియో వైరల్
పెద్ది అంటూ సందడి చేస్తున్నారు రామ్ చరణ్, జాన్వీ కపూర్. ఈ మూవీలో నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన చికిరి సాంగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హైదరాబాద్ లో నిర్వహించిన ఏఆర్ రెహమాన్ కాన్సెర్ట్ లో చెర్రీ, జాన్వీ కామెంట్లు వైరల్ గా మారాయి.
ఫ్యాన్స్ కు రామ్ చరణ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. శనివారం (నవంబర్ 8) రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీలో పాల్గొన్నాడు. జాన్వీ కపూర్, డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి వచ్చాడు. రెహమాన్ క్లాసిక్ పాటలను వినడానికి వచ్చిన అభిమానులు.. రామ్, జాన్వీ వేదికపైకి రావడంతో ఆశ్చర్యపోయారు.

చిన్నప్పటి కల
ఏఆర్ రెహమాన్ కచేరీలో రామ్ చరణ్ వేదికపైకి వచ్చి ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడాడు. “చికిరి పాట అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతంలో భాగం కావడం నా చిన్ననాటి కల. అది కూడా నాకు ఇష్టమైన 'పెద్ది' సినిమాతో కావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే అదృష్టం మరొకటి ఉండదని నేను భావిస్తున్నా” అని రామ్ చరణ్ అన్నాడు. ఆ మాటలకు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.
జాన్వీ తెలుగులో
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో స్పీచ్ తో అదరగొట్టింది.“ఈ సినిమాలో భాగం అయ్యే అవకాశం దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తున్నా. మా ఫస్ట్ సింగిల్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ సినిమాలో మీకు ఒక డిఫరెంట్, యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం” అని తెలుగులో మాట్లాడింది జాన్వీ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
రెహమాన్ కూడా తెలుగు భాషపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. 'పెద్ది' చిత్రానికి పనిచేయడం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ కచేరీకి సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీ తెలుగులో మాట్లాడటం చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.
పెద్ది గురించి..
'పెద్ది' ఒక స్పోర్ట్స్ డ్రామా. ఇందులో రామ్, జాన్వీ, జగపతి బాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. సినిమా ప్రోమోలను బట్టి చూస్తే ఇది ఒక గ్రామీణ క్రికెటర్ కథ అని తెలుస్తోంది. 2010లో వచ్చిన 'కొమరం పులి', 2016లో వచ్చిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాల తర్వాత రెహమాన్ మళ్లీ తెలుగులో పెద్ది కోసమే పనిచేస్తున్నారు. 'పెద్ది' చిత్రం మార్చి 27, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


