హిస్ట‌రీ క్రియేట్ చేసిన చికిరి సాంగ్‌.. 24 గంట‌ల్లో అత్య‌ధిక వ్యూస్‌.. ఈ క్యాచీ మెలోడీని మీరూ పాడేయండి.. లిరిక్స్ ఇవే

ఇప్పుడంతా చికిరి సందడే కనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న పెద్ది మూవీ నుంచి రిలీజైన చికిరి సాంగ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ మూవీ లిరిక్స్ మీకోసమే. మీరూ పాడేయండి. 

Published on: Nov 8, 2025, 20:23:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూట్యూబ్ ను ఊపేస్తోంది పెద్ది సినిమాలోని చికిరి సాంగ్. ఈ సాంగ్ ను గురువారం (నవంబర్ 7) రిలీజ్ చేశారు మేకర్స్. లిరికల్ సాంగ్ అదిరిపోయింది. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ మూవీ సాంగ్ గా చికిరి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ పాటకు 24 గంటల్లో 46 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

చికిరి సాంగ్ లిరిక్స్ (youtube)
చికిరి సాంగ్ లిరిక్స్ (youtube)

చికిరి లిరిక్స్

పెద్ది సినిమాలోని చికిరి సాంగ్ మ్యాజిక్ చేస్తోంది. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన డైరెక్టర్ కాగా.. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చికిరి సాంగ్ ను మోహిత్ చౌహాన్ పాడాడు. బాలాజి సాహిత్యం అందించాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ చికిరి సాంగ్ లిరిక్స్ ఇక్కడున్నాయి. మీరూ పాడేయండి.

ఓ హో.. ల లా లా లాల..

ల ల లా లా లా ..

ఓ హో.. ల లా లా లాల..

ల ల లా లా లా ..

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క

నా ఒళ్ళంత ఆడిందే తైతక్కా…

దీనందాలో లెక్క

దీనేషాలో తిక్క

నా గుండెల్లో పోత్తాందే ఉక్క…

హో చికిరి చికిరి చికిరి

చికిరి చికిరి చికిరి..

పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా

సరుకు సామాను సూసి మీసం లేచి ఏసే కేక

చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక

ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా..

చికిరి చికిరి ఆడంగుల మచ్చయిందిలా

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క

నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…

ఆ ముక్కు పై పెట్టి కోపం

తొక్కేసావే ముక్కెరందం

చింతాకులా.. ఉందే పాదం

చిర్రాకులే నడిచే వాటం..

ఏం బోక్కావో అందాలు, ఒళ్ళంతా వంకీలు

నీ మత్తే తాగిందా తాటికల్లు..

కూసింతే చూత్తే నీలో వగలు

రాసేత్తారుగా ఎకరాలు

నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు

హో చికిరి చికిరి చికిరి

చికిరి చికిరి చికిరి..

పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క

నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…

దీనందాలో లెక్క

దీనేషాలో తిక్క

నా గుండెల్లో పోత్తాందే ఉక్క…

తందనాననా తర్ రంధనాననా

తర్ రంధనాననా తర్ రంధనానా..

తందనాననా తర్ రంధనాననా

తర్ రంధనాననా నా నా నా నా…

నచ్చేసావే మల్లెగంప..

నీ అందాలే నాలో దింప

ఏం తిన్నావో.. కాయ దుంప

నీ యవ్వారం వరద ముంప

నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి

లొట్టెసి ఊరాయి నోట నీళ్లు..

నీ సింగారాన్ని సూత్తావుంటే సొంగకార్చుకుందే

గుండె బెంగ నిదరని మింగేసిందే చెయ్యలేసే చెయ్యలేసే..

చికిరి చికిరి చికిరి

చికిరి చికిరి చికిరి..

పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క

నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…

దీనందాలో లెక్క

దీనేషాలో తిక్క

నా గుండెల్లో పోత్తాందే ఉక్క…

హో చికిరి చికిరి చికిరి

చికిరి చికిరి చికిరి..

పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా

సరుకు సామాను సూసి మీసం లేచి వేసే కేక

చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More