చికిరి పాట సెన్సేషన్.. అల్లు అర్జున్, షారుక్ ఖాన్ రికార్డును బ్రేక్ చేసిన రామ్ చరణ్.. 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే?
పెద్ది సినిమాలోని 'చికిరి చికిరి' పాట సెన్సేషన్ గా మారింది. ఈ సాంగ్ తో అల్లు అర్జున్, షారుక్ ఖాన్ రికార్డును బ్రేక్ చేశాడు రామ్ చరణ్. విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన భారతీయ పాటగా ఇది రికార్డు సృష్టించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' సినిమాలోని 'చికిరి చికిరి' పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. శుక్రవారం (నవంబర్ 7) ఈ లిరికల్ సాంగ్ విడుదలైంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 46 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ పాటతో రామ్ చరణ్.. షారుక్ ఖాన్, అల్లు అర్జున్‌లను అధిగమించాడు.

చికిరి సాంగ్ రికార్డు
పెద్ది సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘చికిరి’ రికార్డు క్రియేట్ చేసింది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన భారతీయ పాటగా 'చికిరి చికిరి' నిలిచింది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ 'చికిరి చికిరి' పాటను భాషను మోహిత్ చౌహాన్ పాడాడు. ఇది విడుదలైన అన్ని భాషల్లో కలిపి 46 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. దీంతో ఇది ఈ సంవత్సరంలో అత్యధికంగా వీక్షించిన, ఇష్టపడిన మ్యూజిక్ ట్రాక్స్‌లో ఒకటిగా నిలవడమే కాకుండా 24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన భారతీయ పాటగా రికార్డు సృష్టించింది.
అఫీషియల్ అనౌన్స్ మెంట్
చికిరి సాంగ్ రికార్డు క్రియేట్ చేసిన విషయాన్ని పెద్ది మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. “ఇండియన్ సినిమాలో అత్యధిక మంది వీక్షించిన సాంగ్ చికిరి చికిరి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన, ఏఆర్ రెహ్మాన్ త్రయం భారతీయ సినిమాలో ఒక కొత్త రికార్డును నెలకొల్పింది. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది” అని రాసుకొచ్చింది.
షారుక్ సాంగ్
2023లో షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాలోని 'జిందా బందా' పాట విడుదలైనప్పుడు, అది 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా నిలిచింది. ఇది మొదటి రోజులోనే 46 మిలియన్ల వ్యూస్ సాధించింది. 'చికిరి చికిరి' పాట లాగే, ఈ పాట కూడా హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో విడుదలైంది.
2024లో అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' సినిమాలోని శ్రీలీల 'కిస్సిక్' పాట 24 గంటల్లో పలు భాషల్లో 42 మిలియన్ల వ్యూస్ సాధించి రెండో స్థానంలో నిలిచింది. అది ఒక దక్షిణాది సినిమాకు అత్యధిక రికార్డుగా నిలిచింది, ఇప్పుడు ఆ రికార్డును 'పెద్ది' బద్దలు కొట్టింది.
పెద్ది సినిమా గురించి..
'పెద్ది' సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లతో పాటు శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


