పెద్ది నుంచి బిగ్ స‌ర్‌ప్రైజ్‌.. చికిరి అంటూ ఫ‌స్ట్ సాంగ్‌.. అదిరేలా రామ్ చ‌ర‌ణ్ హుక్ స్టెప్‌.. రిలీజ్ ఎప్పుడంటే?

రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న పెద్ది మూవీ నుంచి ఎట్టకేలకు ఫస్ట్ లిరికల్ సాంగ్ పై అప్ డేట్ వచ్చింది. ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇస్తూ మేకర్స్ ఓ అనౌన్స్ మెంట్ చేశారు. చికిరి అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనౌన్స్ చేశారు. 

Published on: Nov 05, 2025 11:22 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది మూవీ నుంచి బిగ్ సర్ ప్రైజ్ వచ్చింది. కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇవాళ (నవంబర్ 5) సాంగ్ అప్ డేట్ ను వీడియో ద్వారా పంచుకున్నారు. చికిరి అంటూ సాగనున్న ఈ పాట కచ్చితంగా మ్యూజిక్ లవర్స్ ను మైమరిపించేలా ఉంటుందని తెలుస్తోంది.

చికిరి సాంగ్ లో రామ్ చరణ్ (youtube)
చికిరి సాంగ్ లో రామ్ చరణ్ (youtube)

చికిరి సాంగ్

రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రెడీ అవుతోంది. ఉప్పెనతో గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సాన ఈ మూవీకి డైరెక్టర్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ త్వరలోనే రిలీజ్ కానుంది. నవంబర్ 7న చికిరి అంటూ సాగే పాటను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

ఏఆర్ రెహ్మాన్ తో

పెద్ది మూవీ ఫస్ట్ సాంగ్ అనౌన్స్ మెంట్ ను సినిమా టీమ్ డిఫరెంట్ గా చేసింది. రెహ్మాన్ మ్యూజిక్ స్టూడియోలో డైరెక్టర్ బుచ్చిబాబు, రెహ్మాన్ మాట్లాడుకుంటారు. రెహ్మాన్ పాటల గురించి బుచ్చిబాబు చెప్తాడు. ఈ సారి పెద్ది నుంచి ఆట కాదు పాట రిలీజ్ చేయాలని అనుకుంటున్నానని అంటాడు. అప్పుడే పాట సిచ్యుయేషన్ వివరిస్తాడు.

చికిరి అంటే?

పెద్ది గాడు విలేజ్ లో హీరోయిన్ ను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఒక రకమైన ఫీలింగ్ కు గురవుతాడని బుచ్చిబాబు చెప్తాడు. అప్పుడు ఫ్రెండ్ తో కాటుక అక్కర్లేని ఆ కళ్లు, ముక్కు పుడక అక్కర్లేని ఆ ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరిరా ఈ చికిరి అని అంటాడని బుచ్చిబాబు చెప్తాడు. చికిరి అంటే ఏంటీ? అని రెహ్మాన్ అడిగితే, వాళ్ల ఊర్లో అందమైన అమ్మాయిలను ముద్దుగా పిలుస్తారని బుచ్చిబాబు చెప్తాడు.

అయితే చికిరితోనే సాంగ్ చేద్దామంటారు రెహ్మాన్. ఆ తర్వాత చికిరి అంటూ సాంగ్ అనౌన్స్ మెంట్ వస్తుంది. ఆ వెంటనే నోటిలో బీడీతో రామ్ చరణ్ చేసే హుక్ స్టెప్ అదిరిపోయింది.

పెద్ది రిలీజ్ డేట్

పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ దగ్గర నెగెటివ్ రిజల్ట్ రాబట్టింది. ఈ మూవీ ప్లాఫ్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో పెద్దితో తిరిగి బలంగా కమ్ బ్యాక్ ఇవ్వాలని రామ్ చరణ్ అనుకుంటున్నాడు. ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఈ సినిమాను 2026 మార్చి 27న రిలీజ్ చేయనున్నారు.

హైప్ పెంచేస్తూ

ఇప్పటికే పెద్ది సినిమా నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ మూవీపై హైప్ పెంచేశాయి. గ్రామీణ ప్రాంతంలోని క్రికెటర్ గా రామ్ చరణ్ మాస్ లుక్ అదిరిపోయింది. రీసెంట్ గా అచ్చియమ్మ అంటూ జాన్వీ కపూర్ లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఇప్పుడు చికిరి సాంగ్ తో పెద్ది సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయమే.