జాకెట్ కు అద్దాలు.. మాస్ అవతారం.. రామ్ చరణ్ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర పేరు ఇదే.. అదిరిపోయిన ఫస్ట్ లుక్
బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో 'పెద్ది' తెరకెక్కుతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరును కూడా రివీల్ చేశారు. జాన్వీ కపూర్ లుక్ అదిరిపోయింది.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది మూవీ నుంచి శనివారం (నవంబర్ 1) ఫ్యాన్స్ కు సడెన్ సర్ ప్రైజ్ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ పాత్ర పేరును ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. పెద్ది మూవీ నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. మాస్ అవతారంలో జాన్వీ ఆకట్టుకునేలా ఉంది.

సింగర్ గా జాన్వీ
శనివారం 'పెద్ది' చిత్ర బృందం ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. జాన్వీ పాత్ర పేరు, లుక్‌ను వెల్లడించే రెండు పోస్టర్‌లను చూసిన అభిమానులు ఆమె ఈ చిత్రంలో గాయని పాత్ర పోషిస్తోందని అంచనా వేస్తున్నారు. ఆమె క్యారెక్టర్ పేరు అచ్చియమ్మ.
రెండు పోస్టర్లు
పెద్ది సినిమా నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ షేర్ చేస్తూ మేకర్స్ రెండు పోస్టర్లు పంచుకున్నారు. పెద్ది అధికారిక సోషల్ మీడియా పేజీలో జాన్వీకి సంబంధించిన రెండు లుక్స్‌ను పోస్ట్ చేశారు. ఆమె అచ్చియమ్మ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
“మా పెద్ది ప్రేమకు ఫైర్‌బ్రాండ్ ఆటిట్యూడ్. అందమైన జాన్వీ కపూర్ ను అచ్చియమ్మగా పరిచయం చేస్తున్నాం. పెద్ది 2026, మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది” అనే క్యాప్షన్ తో ఫొటోలు పంచుకున్నారు.
మాస్ లుక్ లో
మొదటి పోస్టర్‌లో జాన్వీ స్పీకర్లు అమర్చిన జీపులో నిలబడి జనసమూహానికి అభివాదం చేస్తూ కనిపించింది. ఆమె ఒక గ్రామ జాతరలో ఉన్నట్లు అనిపిస్తోంది. రెండో పోస్టర్‌లో ఆమె మైక్రోఫోన్ దగ్గర ప్రదర్శన ఇస్తున్నట్లు చాలా దగ్గరగా చూపించారు. రామ్ చరణ్ కూడా ఆమె పోస్టర్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఫ్యాన్స్ రియాక్షన్
జాన్వీ ఈ చిత్రంలో గ్రామీణ గాయని పాత్రలో నటిస్తున్నట్లు కామెంట్లలో అభిమానులు అంచనా వేశారు. వారిలో ఒకరు “హీరోయిన్ - సింగింగ్ ట్రూప్‌లో ప్రధాన గాయని (గ్రామ పండుగ కార్యక్రమాలలో భాగంగా)” అని కామెంట్ చేశారు. ఒక అభిమాని “ఆమె గ్రామీణ ప్రాంతాల్లో గాయని పాత్ర పోషిస్తోందని నేను అనుకుంటున్నా” అని రాశారు. మరొకరు ఆ పేరు పాతకాలం నాటిదిగా ఉందని చమత్కరిస్తూ “మా పక్కింట్లో బామ్మగారి పేరు కూడా అదే” అని రాశారు. కొందరు ఆమె లుక్ 'దేవర'లోని లుక్‌ను పోలి ఉందని భావించారు.
పెద్ది గురించి..
ఉప్పెన ఫేమ్ బుచ్చి దర్శకత్వం వహిస్తున్న పెద్ది చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇందులో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం, ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు. ఇది 2026, మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది.














