బాలీవుడ్‌లో మగ అహంకారాన్ని సాటిస్‌ఫై చేయడానికి నేను అలా నటిస్తాను.. పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ కామెంట్స్
రామ్ చరణ్ పెద్ది సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో మగ అహంకారంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హిందీ టాక్ షో టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్‌లో అతిథిగా హాజరైన జాన్వీ కపూర్ పురుష అహంకారాన్ని సాటిస్‌ఫై చేసేందుకు తాను ఎలా నటిస్తుందో చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ గ్లామర్ డాల్, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ హిందీ, తెలుగు సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇటీవలే పరమ్ సుందరి సినిమాతో ప్రేక్షకులను అలరించిన జాన్వీ కపూర్ తెలుగులో రామ్ చరణ్ పెద్ది సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది.

పురుష అహంకారాన్ని
అయితే, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పురుష అహంకారాన్ని ఒక మహిళగా ఎలా ఎదుర్కోవాలో దాపరికం లేకుండా తాజాగా జాన్వీ కపూర్ చెప్పింది. దీంతో జాన్వీ కపూర్ కామెంట్స్ ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటిఫుల్ సీనియర్ హీరోయిన్స్ కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్‌గా చేస్తున్న హిందీ టాక్ షో టూ మచ్.
జాన్వీ కపూర్ కామెంట్స్
ఈ టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ టాక్ షోలో అతిథిగా హాజరైన జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకుంది. బాలీవుడ్‌లో మేల్ ఇగోను తను ఎలా సాటిస్‌ఫై చేస్తుందో జాన్వీ కపూర్ ఈ టాక్ షోలో తెలిపింది.
ఏం తెలియనట్లు
"ఒక ప్రత్యేకమైన ఆధిక్యత ఉన్న పని వాతావరణంలో నేను ఉన్నానని అర్థం చేసుకున్నాను. కానీ, ఇది పురుష అహంకారం, మగ అహం వంటివైపు దారి తీస్తున్నాయని నేను భావించాను. నాకు ఒక అభిప్రాయం ఉంటే నేను ఎలాంటి బెరుకు లేకుండా చెప్పగలిగే ప్లేసులో, పరిస్థితిలో ఉండాలి. కానీ, నేను అలాంటి పరిస్థితుల్లో ఏం తెలియనట్లు (డంబ్) నటించే ప్లేసులో ఉన్నాను" అని జాన్వీ కపూర్ చెప్పింది.
అభిప్రాయాలు రుద్దకుండా
"మీ పోరాటాన్ని మీరే ఎంచుకోవాలి. ఎవరిపై తప్పుడు అభిప్రాయాలు రుద్దకుండా మీ పాయింట్‌ను ఎలా బయటపెట్టాలో నేర్పరితనం ఉండాలి" అని జాన్వీ కపూర్ చెప్పకొచ్చింది. దాంతో మధ్యలో జోక్యం చేసుకున్న ట్వింకిల్ ఖన్నా 1990స్‌లో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తాను అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పింది.
యుక్తిగా ఉండాల్సిన అవసరాన్ని
అలాంటి పరిస్థితిని జాన్వీ కపూర్ అనుభవిస్తుంటే సానుభూతి వ్యక్తం చేసింది ట్వింకిల్ ఖన్నా. "నేను చిన్నతనంలో అదే సమస్యను ఎదుర్కొన్నాను. కానీ, నేను యుక్తిగా ఉండాల్సిన అవసరాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేదు" అని ట్వింకిల్ ఖన్నా పేర్కొంది.
Posts from the bollyblindsngossip
community on Reddit
స్టార్ హీరోల సతీమణులు
కాగా మోస్ట్ బ్యూటిపుల్ ట్వింకిల్ ఖన్నా స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య అని తెలిసిందే. అలాగే, టూ మచ్ టాక్ షో మరో హోస్ట్ అయిన సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా హిందీ అగ్ర హీరో అజయ్ దేవగన్ సతీమణి. ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ కలిసి ఓ టాక్ షోని హోస్ట్ చేయడం ఇదే తొలిసారి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


