ప్రభాస్ రాజా సాబ్ సెట్‌లో తెలుగు నేర్చుకుంటున్నా.. తెలుగులో చిరంజీవి చాలా ఇష్టం.. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కామెంట్స్

ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ చేస్తున్న విషయం తెలిసిందే. కన్నడలో సంజయ్ దత్ నటించిన సినిమా కేడీ ది డెవిల్. కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా చేసిన కేడీ ది డెవిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. కేడీ ది డెవిల్ టీజర్ లాంచ్‌లో సంజయ్ దత్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

Published on: Jul 11, 2025 1:36 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ ఎత్తున నిర్మించిన చిత్రం ‘కేడీ ది డెవిల్’. ఈ సినిమాను ప్రేమ్ తెరకెక్కించారు. ఈ మూవీలో ధృవ సర్జాకు జోడిగా రీష్మా నానయ్య నటించారు.

ప్రభాస్ రాజా సాబ్ సెట్‌లో తెలుగు నేర్చుకుంటున్నా.. తెలుగులో చిరంజీవి చాలా ఇష్టం.. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కామెంట్స్
ప్రభాస్ రాజా సాబ్ సెట్‌లో తెలుగు నేర్చుకుంటున్నా.. తెలుగులో చిరంజీవి చాలా ఇష్టం.. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కామెంట్స్

ది రాజా సాబ్ విలన్

అలాగే, కేడీ ది డెవిల్ సినిమాలో బాలీవుడ్ హీరో, డబుల్ ఇస్మార్ట్, లియో, ది రాజా సాబ్ విలన్ సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి, హాట్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషించారు. గురువారం (జులై 10) కేడీ ది డెవిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సంజయ్ దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హైదరాబాద్ ఫుడ్ ఇష్టం

సంజయ్ దత్ మాట్లాడుతూ .. "హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ ఎంతో మందితో కలిసి పని చేశాను. మరీ ముఖ్యంగా నాకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను ప్రభాస్ రాజా సాబ్‌ సినిమాకు పని చేస్తున్నాను. అక్కడే తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను" అని అన్నారు.

ఆయన చాలా మంచి వ్యక్తి

"నాకు తెలుగులో చిరంజీవి గారంటే చాలా ఇష్టం. కేవీఎన్ ప్రొడక్షన్స్ వెంకీ సర్, సుప్రిత్‌లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ఇలాంటి మూవీని ఇంత గొప్పగా నిర్మించగలిగారు. డైరెక్టర్ ప్రేమ్ చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు" అని సంజయ్ దత్ తెలిపారు.

శిల్పా శెట్టితో అదే ఎనర్జీ

"రీష్మా చాలా చక్కగా నటించారు. ధృవ్ నా తమ్ముడు లాంటివారు. ధృవ చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి" అని సంజయ్ దత్కోరారు.

హీరో ధృవ కామెంట్స్

హీరో ధృవ సర్జా మాట్లాడుతూ .. "కేడీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కెమెరామెన్ విలియం, మా నిర్మాత వెంకట్, సుప్రిత్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ అందరికీ ధన్యవాదాలు. నాకు సంజయ్ దత్ గారు అంటే ఎంతో ఇష్టం. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది" అని చెప్పాడు.

మా యాక్టింగ్‌ను

"శిల్పా శెట్టి వంటి యాక్టర్లతో పని చేయడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. సెట్స్ మీద ఆమె మా యాక్టింగ్‌ను కరెక్ట్ చేస్తుంటారు. రీష్మా మంచి నటి. మా మూవీ త్వరలోనే రాబోతోంది. అందరూ చూడండి. అందరికీ నచ్చుతుంది" అని హీరో ధృవ సర్జా తెలిపాడు.

News/Entertainment/ప్రభాస్ రాజా సాబ్ సెట్‌లో తెలుగు నేర్చుకుంటున్నా.. తెలుగులో చిరంజీవి చాలా ఇష్టం.. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కామెంట్స్
News/Entertainment/ప్రభాస్ రాజా సాబ్ సెట్‌లో తెలుగు నేర్చుకుంటున్నా.. తెలుగులో చిరంజీవి చాలా ఇష్టం.. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కామెంట్స్