ఓటీటీలో ఒకేరోజు 2 తెలుగు క్రైమ్ థ్రిల్లర్స్- మరికొన్ని గంటల్లో హీరో నవీన్ చంద్ర 3 సినిమాలు- ఇంకోటి థియేటర్లలో రీ రిలీజ్!

ఒకేరోజు అటు ఓటీటీ, ఇటు థియేటర్లలో హీరో నవీన్ చంద్ర నటించిన 3 సినిమాలు అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఒకే ఓటీటీలో రెండు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుంటో మరోకటి థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Jun 12, 2025, 12:42:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర కథానాయకుడిగా, విలన్‌గా, నటుడిగా అనేక పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఎక్కువగా ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్‌తో ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు.

ఓటీటీలో ఒకేరోజు 2 తెలుగు క్రైమ్ థ్రిల్లర్స్- మరికొన్ని గంటల్లో హీరో నవీన్ చంద్ర 3 సినిమాలు- ఇంకోటి థియేటర్లలో రీ రిలీజ్!
ఓటీటీలో ఒకేరోజు 2 తెలుగు క్రైమ్ థ్రిల్లర్స్- మరికొన్ని గంటల్లో హీరో నవీన్ చంద్ర 3 సినిమాలు- ఇంకోటి థియేటర్లలో రీ రిలీజ్!

మూడు సినిమాలు ఒకేరోజు

అయితే, అలాంటి హీరో నవీన్ చంద్ర నటించిన మూడు సినిమాలు ఒకేరోజు విడుదల కానున్నాయి. వాటిలో రెండు తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుండగా.. మరొకటి థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

అందాల రాక్షసి రీ రిలీజ్

నవీన్ చంద్ర హీరోగా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన మూవీ అందాల రాక్షసి. ఈ సినిమాతో హీరోలుగా నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి, డైరెక్టర్‌గా హను రాఘవపూడి నలుగురు డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు. 2012 ఆగస్ట్ 10న థియేటర్లలో విడుదలైన అందాల రాక్షసి సినిమా సూపర్ హిట్ అయింది.

ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.8 రేటింగ్ తెచ్చుకున్న అందాల రాక్షసి మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్ అయింది. అలాంటి అందాల రాక్షసి రీ రిలీజ్ కానుంది. జూన్ 13న థియేటర్లలో అందాల రాక్షసి మూవీ రీ రిలీజ్ కానుంది. దీనికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.

లెవెన్ ఓటీటీ రిలీజ్

నవీన్ చంద్ర రీసెంట్‌గా నటించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్. వైజాగ్‌లో మొహం కూడా ఏర్పడకుండా జరిగే హత్యలను చేధించే కథతో సాగే ఈ సినిమాకు లోకేష్ అజీల్స్ దర్శకత్వం వహించారు. ఐఎమ్డీబీ నుంచి 7.9 రేటింగ్ సాధించిన లెవెన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అందుకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్‌లో లెవెన్ ఓటీటీ రిలీజ్ కానుంది. జూన్ 13 నుంచి అంటే రేపటి నుంచి తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో నవీన్ చంద్ర లెవెన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

బ్లైండ్ స్పాట్ ఓటీటీ స్ట్రీమింగ్

హీరో నవీన్ చంద్ర నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాల్లో బ్లైండ్ స్పాట్ ఒకటి. ఓ గృహిణి సూసైడ్ కేసు మర్డర్‌ అని పసిగడతాడు పోలీస్. ఆ తర్వాత ఆ కేస్ ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే బ్లైండ్ స్పాట్.

రాశి సింగ్, రవి వర్మ, గాయత్రి భార్గవి, అలీ రెజా నటించిన బ్లైండ్ స్పాట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రేపటి (జూన్ 13) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇలా మరికొన్ని గంటల్లోనే నవీన్ చంద్ర మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More