రష్మిక మందన్నా ప్రతి ఒక్కరి గర్ల్‌ఫ్రెండ్.. బిగ్ బాస్‌లో నేషనల్ క్రష్‌పై నాగార్జున పంచ్‌లు.. ఐ లవ్యూ చెప్పిన రీతూ చౌదరి

బిగ్ బాస్ 9 తెలుగులోకి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చింది. రష్మిక మందన్నాతోపాటు గర్ల్‌ఫ్రెండ్ మూవీ హీరో దీక్షిత్ శెట్టి కూడా వచ్చాడు. స్టేజీపైకి వచ్చిన రష్మిక మందన్నాపై హోస్ట్ నాగార్జున్ పంచ్‌లు వేశాడు. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 నవంబర్ 2 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

Published on: Nov 2, 2025, 14:50:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. ఇప్పటికీ బిగ్ బాస్ నుంచి ఈ వారం దివ్వెల మాధురి లీక్ అయిన విషయం తెలిసిపోయింది. ఇక ప్రతి వీకెండ్ కంటెస్టెంట్లపై రివ్యూ చేసే హోస్ట్ నాగార్జున వచ్చేశారు. శనివారం నాటి ఎపిసోడ్‌లో సీరియస్ వార్నింగ్‌లు ఇచ్చిన నాగార్జున ఆదివారం సరదా టాస్క్‌లు నిర్వహించనున్నార.

రష్మిక మందన్నా ప్రతి ఒక్కరి గర్ల్‌ఫ్రెండ్.. బిగ్ బాస్‌లో నేషనల్ క్రష్‌పై నాగార్జున పంచ్‌లు.. ఐ లవ్యూ చెప్పిన రీతూ చౌదరి
రష్మిక మందన్నా ప్రతి ఒక్కరి గర్ల్‌ఫ్రెండ్.. బిగ్ బాస్‌లో నేషనల్ క్రష్‌పై నాగార్జున పంచ్‌లు.. ఐ లవ్యూ చెప్పిన రీతూ చౌదరి

స్టైలిష్‌గా నాగార్జున

అలాగే, బిగ్ బాస్ తెలుగు 9 నవంబర్ 2 తేది ఎపిసోడ్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గెస్ట్‌గా హాజరైంది. దీనికి సంబంధించిన నేటి బిగ్ బాస్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇవాళ ప్రసారమయ్యే బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్‌లో స్టైలిష్ డ్రెస్సులో నాగార్జున కనిపించాడు.

నిన్న పోయి ఇవాళ

"కింగ్ ఈజ్ బ్యాక్" అని సంజన గల్రాని అంది. "అంటే ఇప్పటిదాకా బ్యాక్ లేదా" అని నాగార్జున పంచ్ వేస్తే.. "నిన్న పోయి ఇవాళ బ్యాక్ సర్" అని సంజన బదులిచ్చింది. దానికి అంతా నవ్వేశారు. తర్వాత రష్మిక మందన్నా స్టేజీ మీదకు ఎంట్రీ ఇచ్చింది. నాగార్జునను హగ్ చేసుకుంది.

ప్రతి ఒక్కరి గర్ల్‌ఫ్రెండ్

"రష్మిక ఒక విషయం చెప్పు. నువ్వు రష్మికలా వచ్చావా. గర్ల్‌ఫ్రెండ్‌లా వచ్చావా" అని నాగార్జున అడిగాడు. "రష్మిక ప్రతి ఒక్కరి గర్ల్‌ఫ్రెండ్" అని రష్మిక మందన్నా చెప్పి నవ్వేసింది. దాంతో నాగార్జున నవ్వాడు. అనంతరం దసరా మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి ఎంట్రీ ఇచ్చాడు.

ఏమైనా సరే కాపాడుతాను

దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే బిగ్ బాస్ తెలుగు 9 స్టేజీపై సందడి చేశారు రష్మిక, దీక్షిత్. "ఇలాంటి గర్ల్‌ఫ్రెండ్ నీకు లైఫ్‌లో దొరికితే ఏం చేస్తావ్" అని దీక్షిత్ శెట్టిని అడిగాడు నాగార్జున. "ఏది ఏమైనా సరే తనను కాపాడుతాను" అని దీక్షిత్ సమాధానం ఇచ్చాడు.

రీతూకు లవ్ సింబల్

తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టిని చూపించి పరిచయం చేశారు. నేషనల్ క్రష్‌ను చూసిన రీతూ చౌదరి "ఐ లవ్యూ రష్మిక" అంటూ అరిచేసింది. దానికి లవ్ సింబల్‌ను తన వేళ్లతో చూపించింది రష్మిక. మనముందు "నేషనల్ క్రష్మిక ఉంది" అని నాగార్జున పంచ్ వేశాడు.

కంటెస్టెంట్ల పర్ఫామెన్స్‌పై

దానికి షాక్ అయిన రష్మిక నవ్వుతూ నాగార్జున దగ్గరికి వెళ్లింది. సరదాగా అన్నట్లు రష్మికను సైడ్ నుంచి హగ్ చేసుకున్నాడు నాగార్జున. తర్వాత కంటెస్టెంట్ల పర్ఫామెన్స్‌ను రష్మిక, దీక్షిత్ జడ్జ్ చేస్తారని నాగార్జున చెప్పాడు.

రీక్రియేషన్

సినిమాల్లోని సీన్స్‌ను బిగ్ బాస్ కంటెస్టెంట్లతో రీ క్రియేట్ చేయించారు. వాటికి రష్మిక, దీక్షిత్ నవ్వుతూ సరదాగా గడిపారు. అలా బిగ్ బాస్ 9 తెలుగు టుడే ఎపిసోడ్ ప్రోమో ముగిసింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More