నీకు మతిమరుపు ఉందా ఇమ్మాన్యుయెల్- ప్రశ్నించిన నాగార్జున- తనూజ విషయంలో వీడియోతో షాక్ ఇచ్చిన బిగ్ బాస్ హోస్ట్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. ఇప్పుడు ఎనిమిదో వారానికి బిగ్ బాస్ తెలుగు 9 చేరుకుంది. బిగ్ బాస్ తెలుగు 9 నవంబర్ 1వ తేది ఎపిసోడ్‌లో వీకెండ్ సందర్భంగా హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల ఆట తీరుపై రివ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్‌ను నాగార్జున మందలించాడు.

Published on: Nov 1, 2025, 23:22:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌ ఎనిమిదో వారం పూర్తి చేసుకోనుంది. అయితే, ప్రతి వారం కంటెస్టెంట్ల ఆట తీరుపై హోస్ట్ నాగార్జున వచ్చి రివ్యూలు ఇస్తాడని తెలిసిందే. అలాగే, ఈ శనివారం (నవంబర్ 1) నాటి ఎపిసోడ్‌లో కూడా నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు.

నీకు మతిమరుపు ఉందా ఇమ్మాన్యుయెల్- ప్రశ్నించిన నాగార్జున- తనూజ విషయంలో వీడియోతో షాక్ ఇచ్చిన బిగ్ బాస్ హోస్ట్ (Star Maa/YouTube)
నీకు మతిమరుపు ఉందా ఇమ్మాన్యుయెల్- ప్రశ్నించిన నాగార్జున- తనూజ విషయంలో వీడియోతో షాక్ ఇచ్చిన బిగ్ బాస్ హోస్ట్ (Star Maa/YouTube)

హౌజ్‌లో నుంచి వెళ్లిపోయావ్

ముందుగా ఎలిమినేట్ అయి రీ ఎంట్రీ ఇచ్చి పర్మనెంట్ కంటెస్టెంట్‌గా మారిన భరణి శంకర్‌ను లేపారు నాగార్జున. "భరణి ముందు ఒక విషయం చెప్పు. సేఫ్ ఆడి ఆడి.. హౌజ్‌లో నుంచి వెళ్లిపోయావ్. మళ్లీ సేఫ్ ఆడతావా.. ఆడుదామనుకుంటున్నావా" అని నాగార్జున అడిగాడు.

200 పర్సంట్

"ఇప్పుడు ఈ వీక్ సేఫ్ ఆడాను అంటున్నారా సర్" అని భరణి అన్నాడు. "200 పర్సంట్" అని నాగార్జున అన్నాడు. "కెప్టెన్సీ టాస్క్‌లో భరణి స్టాండ్ తీసుకున్నాడా, సేఫ్ ఆడాడా" అని సుమన్ శెట్టిని నాగార్జున ప్రశ్నించాడు. "నాకు అయతే సేఫే అనిపించింది సార్" అని సుమన్ శెట్టి బదులిచ్చాడు.

2 నిమిషాల 14 సెకన్ల పాటు

"సాంగ్ మొదలైంది సర్ నేను తనూజ దగ్గరికి వెళ్లి దివ్యకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాలనుకున్నాను. అప్పుడే పాట ఆగిపోయింది. చెప్పలేకపోయాను" అని భరణి వివరణ ఇచ్చుకున్నాడు. "నువ్ ఏ స్టాండ్ తీసుకోకుండా మధ్యలో నిల్చున్నావ్. 2 నిమిషాలు 14 సెకన్స్ పాటు పాట ప్లే అయింది. నీకు చెప్పడానికి అంత టైమ్ పట్టిందా" అని నాగార్జున అన్నారు.

నిన్ను కన్సల్ట్ చేసిందా

దాంతో భరణి సైలెంట్ అయిపోయాడు. తర్వాత జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్‌ను లేపిన నాగార్జున "నీకు మతిమరుపు కాస్తా ఎక్కువ ఉందా. అప్పుడప్పుడు మర్చిపోతుంటావా. తనూజను నామినేట్ చేసినప్పుడు చిన్న కారణం ఉందన్నావ్. రాము పేరు చెప్పినప్పుడు నిన్ను కన్సల్ట్ చేసిందా లేదా" అని అడిగాడు.

వీడియోతో షాక్ ఇచ్చిన నాగార్జున

"నన్ను అయితే కన్సల్ట్ చేయలేదు సర్" అని ఇమ్మాన్యుయెల్ చెప్పాడు. దాంతో "బిగ్ బాస్ వీడియో ప్లీజ్" అని ఇమ్ముకు నాగార్జున షాక్ ఇచ్చాడు. అందులో ఇమ్మాన్యుయెల్‌కు తనూజ సైగ చేస్తూ అడగడం.. ఇచ్చేయ్ అన్నట్లుగా ఇమ్ము చేయి ఊపడం ఉంది. దాంతో తనూజ రామును సెలెక్ట్ చేయడం చూపించారు. అది చూసిన తనూజ ఎమోషనల్ అయింది.

చేయి ఊపకుండా ఉండాల్సింది

"సర్ నేను నీ నిర్ణయం చెప్పు అన్నాను సర్" అని ఇమ్మాన్యుయెల్ అన్నాడు. "అలాంటప్పుడు నువ్వు ఇలా చేయి ఊపకుండా ఉండాల్సి కదా" అని హోస్ట్ నాగార్జున అన్నాడు. దాంతో ఇమ్ము సైలెంట్ అయిపోయాడు. "ఆ మాట ఏదైతో చెప్పాడో ఆ యాక్షన్ కూడా అదే చెప్పాడు. రాము వెళ్లని నేను ఉంటాను అనేసి" అని తనూజ పుట్టస్వామి అంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More