తలరాత రాయనున్న బిగ్ బాస్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్- ఇమ్మాన్యుయెల్‌కు 2 నాలుకలు-ముద్దు మాటలతో మందార పూలు పెడుతున్నారంటూ!
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో ఎలిమినేట్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న ఇంటి సభ్యులను నామినేట్ చేసే ప్రక్రియ తీసుకొచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో ఇమ్మాన్యూయెల్ వర్సెస్ తనూజ గొడవ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు 9 ఏడో వారం చిట్టి అలేఖ్య పికిల్స్ సిస్టర్ రమ్య మోక్ష ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. దాంతో ప్రస్తుతం హౌజ్‌లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే, ఈ వారం కూడా బిగ్ బాస్ తెలుగు 9లో నామినేషన్స్ జరగనున్నాయి.

బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్
ఈసారి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారం నామినేషన్స్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 అక్టోబర్ 27 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో నామినేషన్స్‌లో భాగంగా అందరు ఇంటి సభ్యులు గార్డెన్‌లో కూర్చున్నారు.
"బిగ్ బాస్ ఇల్లు నామినేషన్స్ సమరానికి మరోసారి సిద్ధమైంది. మీరు ఆడే ఆటను ఒళ్లంత కళ్లు చేసుకుని చూసినవారు మీ తలరాత రాయబోతున్నారు" అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగు పెట్టారు.
ఇంటి సభ్యులుగా మారి
"వీరిలో కొద్దిమంది తిరిగి ఇంట్లో ఇంటి సభ్యులుగా మారి మీరు కోరుకునే బిగ్ బాస్ ట్రోఫీ కోసం మీతోపాటు పోరాడి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు" అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సంజను నామినేట్ చేసిన ప్రియా శెట్టి "మీరు మాట్లాడితే బాడీ షేమింగ్ చేస్తున్నారు, రోడ్ రోలర్ అంటున్నారు. అది కామెడీగా తీసుకున్నారు కానీ అది ఫన్నీ కాదు" అని అంది.
"నేను కూడా బక్కగా ఏం లేను" అని సంజన అంటే.. "మీ గురించి మీరు ఏమైనా అనుకోండి. మనిషికి ఇన్‌సెక్యురిటీ ఉంటుంది" అని పంచ్ వేసింది ప్రియా శెట్టి. అన్న వచ్చి నామినేషన్ చేయడానికి టికెట్ ఇచ్చిండు. సంజన గారిని నామినేట్ చేశావ్. చిన్న వెన్నుపోటు పొడిచేశావ్ అన్నని" అని కల్యాణ్‌ను మనీష్ మర్యాద అన్నాడు.
నామినేషన్స్ రోజే
"ముందు రోజు నేను ఏం మాట్లాడానో కెమెరాలకు తెలియదా" అని కల్యాణ్ అంటే.. "నామినేషన్స్ చేస్తాను అని నామినేషన్స్ రోజే చెప్పావ్" అని ఇమ్మాన్యుయెల్ అన్నాడు. తర్వాత ఇమ్ము తనూజ మధ్య గొడవ అయింది. "బొమ్మల గేమ్‌లో తనూజ నా గురించే పోరాడింది. లాస్ట్ ఓటింగ్ విషయానికొచ్చేసరికి రాముకు వేశావ్. నాకు మైండ్ పోయింది. నాకు అర్థం కాలేదు" అని ఇమ్మాన్యుయెల్ అన్నాడు.
"ఇలా తల ఊపాడు. ఆ తల ఊపినందుకే నేను కాన్ఫిడెంట్‌గా రామును సేవ్ చేశా. ఈ పర్సన్ ఇప్పుడు డబుల్ టంగ్‌తో (రెండు నాలుకలతో) మాట్లాడుతున్నాడు" అని తనూజ చెప్పింది. నేను చెప్పిన పర్సన్‌ను చేస్తే రామును ఎందుకు సేవ్ చేశావమ్మా అని ఎందుకు అడిగాను నేను" అని ఇమ్మాన్యూయెల్ అన్నాడు.
ముద్దు మాటలు చెప్పి
"నా పక్కన ఉన్నదాంట్లో కూడా చివరికి వెళ్లి పోసా" అని ఇమ్ము అంటే "పోశావ్. నేను మాట్లాడుతున్నాను.. మాట్లాడుతున్నాను" అని తనూజ అరుస్తూ చెప్పింది. తర్వాత తనూజను కత్తితో గుచ్చి నామినేట్ చేశాడు ఇమ్మాన్యూయెల్.
"ముద్దు మాటలు చెప్పి మందార పువ్వులు చెవిలో పెడుతున్నారు మీరు. చాలా సింపుల్‌గా చెబుతున్నా" అని మనీష్ మర్యాద అన్నాడు. అతను ఎవరిని అన్నాడో చూపించలేదు. మనీష్ చెప్పాక దివ్య, తనూజను చూపించారు. అక్కడితో నేటి బిగ్ బాస్ 9 తెలుగు ఎపిసోడ్ ప్రోమో ముగిసింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


