బిగ్ బాస్ నుంచి ఇవాళ రమ్య మోక్ష ఎలిమినేట్- వైల్డ్‌గా వచ్చి 15 రోజులకే అవుట్- వైరల్ బ్యూటీ 2 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఇవాళ రమ్య మోక్ష ఎలిమినేట్ కానుంది. అక్టోబర్ 12న జరిగిన బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ 2.Oతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష హౌజ్‌లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. మరి 2 వారాలకు రమ్య మోక్ష రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.
బిగ్ బాస్ 9 తెలుగు జోరుగా సాగిపోతుంది. ఇప్పుడు ఏడో వారం కూడా పూర్తి కానుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నేటితో 7వ వారం పూర్తి కానుంది. ఇక బిగ్ బాస్ అన్నాక ప్రతివారం ఒకరి ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఇప్పటికీ ఎలిమినేట్ అయినవాళ్లు
ఇలా ఇప్పటికే శ్రేష్టి వర్మ, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము, భరణి శంకర్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ఈ మధ్యలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు. ప్రస్తుతం హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారికి ఏడో వారం నామినేషన్స్ నిర్వహించారు.
అరుపులు, కేకలతో సాగిన బిగ్ బాస్ తెలుగు 9 ఏడో వారం నామినేషన్స్‌లో 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈ వారం రాము రాథోడ్, తనూజ పుట్టస్వామి, కల్యాణ్ పడాల, సంజన గల్రానీ, రమ్య మోక్ష, రీతూ చౌదరి, సాయి శ్రీనివాస్, దివ్య నిఖితా నామినేషన్స్‌లో ఉన్నారు. వీరికి నామినేషన్స్ పూర్తయిన రోజు నుంచే ఓటింగ్ పోల్స్ ఓపెన్ చేశారు.
బిగ్ బాస్ ఓటింగ్ ఇలా
బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం ఓటింగ్‌లో అధికంగా ఎక్కువగా ఓట్లు రాబట్టి తనూజ టాప్ 1లో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో కల్యాణ్, మూడో ప్లేసులో దివ్య, ఐదో స్థానంలో రీతూ చౌదరి నిలిచారు. అలాగే, ఆరో ప్లేసులో సంజన, ఏడో స్థానంలో రాము రాథోడ్ ఓటింగ్ దక్కించుకున్నారు.
ఇక డేంజర్ జోన్ అయిన చివరి రెండు స్థానాలు 8, 9లో సాయి శ్రీనివాస్, రమ్య మోక్ష మిగిలారు. ఓటింగ్ ప్రారంభం నుంచి వారం ముగిసేవరకు ఓటింగ్‌లో పెద్దగా మార్పులు జరగలేదు. చివరి రెండు స్థానాల్లోనే వీరిద్దరు ఉంటూ వచ్చారు. చివరిగా వీరిద్దరిలోనే ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించారు.
రమ్య మోక్ష ఎలిమినేట్
ఇద్దరిలో అందరి కంటే ఎక్కువగా నెగెటివిటీ తెచ్చుకున్న రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం రమ్య మోక్ష ఎలిమినేషన్ ఎపిసోడ్ షూటింగ్ శనివారం (అక్టోబర్ 15) నాడే పూర్తి అయిపోయింది. కానీ, బిగ్ బాస్ రమ్య మోక్ష ఎలిమినేషన్‌ను ఇవాళ (అక్టోబర్ 26) ప్రసారం చేయనున్నారు.
చిట్టి అలేఖ్య పికిల్స్ సిస్టర్స్ సోషల్ మీడియాలో తెగ్ ట్రెండ్ అవడమే కాకుండా విపరీతమైన నెగెటివిటీ తెచ్చుకున్నారు. వారిలో ఒకరైన రమ్య మోక్ష వైల్డ్ కార్డ్ కంటెంస్టెంట్గా అక్టోబర్ 12న బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ 2.Oతో హౌజ్‌లోకి అడుగుపెట్టింది.
రమ్య మోక్ష రెమ్యునరేషన్
వచ్చి రాగానే కల్యాణ్, తనూజలపై కామెంట్స్ చేసి నెగెటివిటీ ఏర్పర్చుకుంది రమ్య మోక్ష. ఆమెకు నోటి దూల ఎక్కువంటూ ట్రోల్స్ కూడా పడ్డాయి. కానీ, ఫిజికల్ టాస్క్‌లు బాగా ఆడేదని మంచి పేరు తెచ్చుకుంది. ఇలా హౌజ్‌లోకి వచ్చిన దాదాపు 15 రోజులకే రమ్య మోక్ష ఎలిమినేషన్‌తో ఇంటి నుంచి అవుట్ అయింది. ఆమె సెలబ్రిటీ కోటాలోనే బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టింది.
బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు రమ్య మోక్షకు వారానికి రూ. 2 నుంచి 3 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన 2 వారాలు హౌజ్‌లో ఉన్న సోషల్ మీడియా వైరల్ బ్యూటి రమ్య మోక్ష సుమారుగా రూ. 4 లేదా 6 లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది.

E-Paper












