నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలా, మనుషులను పంపించే దేవతవి.. బిగ్ బాస్‌లో సీరియల్ హీరోయిన్‌పై రమ్య మోక్ష అరుపులు
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. ఇటీవలే ఆరో వారంలో భరణి శంకర్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఏడోవారంలోకి అడుగుపెట్టింది. ఇక ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో సీరియల్ హీరోయిన్ తనూజ గౌడపై రమ్య మోక్ష అరుపులు వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ రంజుగా సాగుతోంది. నిత్యం నామినేషన్స్, అరుపులు, గొడవలు, లవ్ ట్రాక్‌లు, బాండిగ్స్‌తో జోరుగా సాగుతోంది. అక్టోబర్ 19న బిగ్ బాస్ 9 తెలుగు ఆరో వారంలో భరణి శంకర్ ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో ప్రస్తుతం హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ మిగిలారు.

బిగ్ బాస్ నామినేషన్స్ ఈ వారం
ఇక ఏడో వారంలోకి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ అడుగుపెట్టింది. కాబట్టి, ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ అయ్యేందుకు బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ వారం ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ జరుగుతున్నాయి. నామినేట్ చేయాలనుకుంటున్న కంటెస్టెంట్ మొహానికి ఫోమ్ రాసి కారణాలు చెప్పాలి.
దీనికి సంబంధించిన బిగ్ బాస్ 9 తెలుగు అక్టోబర్ 20 ఎపిసోడ్ నాటి ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో మొదటగా యాక్టర్ సాయి శ్రీనివాసను దివ్య నిఖితా నామినేట్ చేసింది. "నీదే రైట్ ఒపినీయన్ అనే అభిప్రాయంలో ఉంటారనిపిస్తుంది" అని దివ్య నిఖితా అంటే.. "ఒక సిచ్చువేషన్ చెప్పండి" అని సాయి శ్రీనివాస అన్నాడు.
దివ్య వల్ల ఎలిమినేట్
"నేను చెప్పను సాయి. నాకు అవసరం లేదు" అని దివ్య అంటే.. సాయి ఆశ్చర్యపోయాడు. తర్వాత "మీ వల్ల పైన ఉన్నవాళ్లు ఇలా కిందకు పడి నామినేట్ అయిపోయారు" అని సాయి అన్నాడు. "దివ్య వల్ల ఎలిమినేట్ అయ్యారని ఎవరు చెప్పలేదు" అని దివ్య అంది. మీరు చెప్పిన కారణం వాలిడిటీగా లేదు" అని గట్టిగా అరిచాడు సాయి శ్రీనివాస.
తర్వాత సింగర్ రాము రాథోడ్‌ను జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి నామినేట్ చేస్తూ "నువ్వు ఎక్కడ కనిపించట్లేదు" అంది. "కళ్లు చెకప్ చేసుకుంటే బెటర్" అని రాము పంచ్ వేశాడు. "నన్ను ఇలా ఒక్కడిని చేసేశారు అన్నట్లు అనిపించింది" అంటూ రీతూ చౌదరి అంటే.. "నీకు అనిపించింది కాదు ప్రూఫ్ చూపించు" అని రాము రాథోడ్ అరిచాడు.
డ్రామా క్వీన్‌వి
"అలా అయింటే నేను కెప్టెన్ అయ్యేవాన్ని కాదు" అని రాము అంటే.. "నీకు ఏ సపోర్ట్ లేకుండానే ఫోర్త్ కెప్టెన్ అయ్యావా" అని రీతూ అంది. "నీకే సపోర్ట్ లేదు. నాకు సపోర్ట్ చేయండి అని నేను ఎవరినైనా అడిగానా" అంటూ ఒక్కొక్కరిని రాము అడిగాడు. దానికి అయేషా జీనత్ లేదు అని చెప్పింది. అందరూ కూడా లేదని తల ఊపారు.
"నాకు గేమ్ ఆడే సత్తా ఉంది ఆడుతా" అని రాము అన్నాడు. తర్వాత సీరియల్ హీరోయిన్ తనూజ గౌడను చిట్టి అలేఖ్య పికిల్స్ సిస్టర్ రమ్య మోక్ష నామినేట్ చేసింది. "నువ్వు ఒక ముసుగులో ఉన్నావ్. బయటకు రా. నువ్ ఒక డ్రామా క్వీన్. నువ్వు నటిస్తున్నావ్. నువ్వు ఫేక్" అని రమ్య అంది.
వచ్చి దర్శనం చేసుకో
"ఇది నా గేమ్. నన్ను పాయింట్ అవుట్ చేయడానికి నువ్వెవరు. ఫస్ట్ నీ ఏజ్‌కు తగ్గట్లు బిహేవ్ చేయు" అని తనూజ అంది. "నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగల. మనుషులను పంపించడానికి వచ్చిన దేవతవి" అని రమ్య మోక్ష అంది. దానికి "ఓ యా థాంక్యూ వచ్చి నేను దేవత వచ్చి దర్శనం చేసుకో. వెళ్లవమ్మా" అని తనూజ రియాక్షన్ ఇచ్చింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


