బిగ్ బాస్ 9 తెలుగు: బాబోయ్ దివ్వెల మాధురి-హడలెత్తిపోతున్న హౌస్‌మేట్స్‌- సంజనను దొంగ అంటూ- ఓటింగ్ డేంజర్ జోన్లో రాము

బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టిన దివ్వెల మాధురి నోటికి పని చెబుతోంది. ఎవరిపై పడితే వాళ్లపై అరిచేస్తుంది. ఆమెను చూస్తేనే హౌస్ మేట్స్ హడలెత్తిపోతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఆరో వారం ఓటింగ్ లో ఫోక్ సింగర్ రాము డేంజర్ జోన్లో ఉన్నాడు. 

Published on: Oct 15, 2025 12:02 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ మరింత రసవత్తరంగా మారింది. ఆదివారం నాడు దివ్వెల మాధురి, అయేషా, శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా వైల్డ్ కార్డు ఎంట్రీలుగా హౌస్ లోకి అడుగుపెట్టారు. వీళ్ల రాకతో గేమ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇందులో దివ్వెల మాధురిని చూసి ఇతర హౌస్ మేట్స్ హడలెత్తిపోతున్నారు.

బిగ్ బాస్ 9 తెలుగు అప్ డేట్స్ (youtube)
బిగ్ బాస్ 9 తెలుగు అప్ డేట్స్ (youtube)

సంజనను దొంగ

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లోకి వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చింది దివ్వెల మాధురి. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచే గట్టిగానే మాట్లాడుతుంది. ఇవాళ అయితే ఏకంగా సంజన గల్రానీని దొంగ అని, దివ్య నిఖితను తీసేయండి అంటూ ఫైర్ అయింది. అద్దం దగ్గర తన స్టిక్కర్ ప్యాకెట్ కనిపించడం లేదని మాధురి అడిగింది. అమ్మ తీసిందని సంజన గురించి ఇమ్ము చెప్పాడు. సంజన ఏమో దాన్ని డిసిప్లిన్ కోసం పాడేశానని అంటుంది.

రచ్చ రచ్చ

స్టిక్కర్ ప్యాకెట్ పారేశానని సంజన అనగానే ఏంటీ కామెడీగా ఉందా అంటూ దివ్వెల మాధురి స్టార్ట్ చేసింది. గుడ్డు దొంగతనం చేసినట్లే స్టిక్కర్స్ కూడా దొంగతనం చేశారని, మీకు ఆల్రెడీ బోర్డు వేశారు కదా దొంగ అని మీకు అలవాటేమో అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏంటీ అంటే ఏంటీ అంటుంది మాధురి.

కర్రీ కోసం

ఎగ్ దోశను కర్రీ వేసుకుని తింటుంది మాధురి. మరి నన్ను అడగాలి కదా అని దివ్య నిఖిత అంటుంది. నాకు ఫుడ్ మానిటరే నచ్చలేదు మార్చేయండని అంటుంది మాధురి. కెప్టెన్ కల్యాణ్ వచ్చి చెప్పినా మాధురి వినదు. ఇక నాకు బాండింగ్ అవసరం లేదు, నాన్ననాన్న అంటూ వెటకారంగా మాట్లాడుతుంది మాధురి. అది చూసి హౌస్ మేట్స్ అందరూ హడలెత్తిపోతారు.

బిగ్ బాస్ 9 ఓటింగ్

ఇక బిగ్ బాస్ 9 తెలుగు ఆరో వారం నామినేషన్ విషయానికి వస్తే ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. దివ్య నిఖిత, రాము రాథోడ్, భరణి, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి. ఇందులో ఫోక్ సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే రాము రాథోడ్ ఎలిమినేట్ అవ్వడానికి చేరువగా ఉన్నాడు.

టాప్ లో ఆమెనే

బిగ్ బాస్ 9 తెలుగు ఆరో వారం ఓటింగ్ ట్రెండ్ చూస్తే తనూజ పుట్టస్వామి 31.86 శాతం ఓట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా సుమన్ శెట్టి (24.79 శాతం), డీమాన్ పవన్ (11.80 శాతం), దివ్య నిఖిత (11.37 శాతం), భరణి (10.68 శాతం) రెండు నుంచి అయిదు స్థానాల్లో ఉన్నారు. రాము రాథోడ్ ఏమో 9.51 శాతంతో లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇదే ట్రెండ్ కొనసాగితే రాము ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి.

News/Entertainment/బిగ్ బాస్ 9 తెలుగు: బాబోయ్ దివ్వెల మాధురి-హడలెత్తిపోతున్న హౌస్‌మేట్స్‌- సంజనను దొంగ అంటూ- ఓటింగ్ డేంజర్ జోన్లో రాము
News/Entertainment/బిగ్ బాస్ 9 తెలుగు: బాబోయ్ దివ్వెల మాధురి-హడలెత్తిపోతున్న హౌస్‌మేట్స్‌- సంజనను దొంగ అంటూ- ఓటింగ్ డేంజర్ జోన్లో రాము