బిగ్ బాస్ 9 తెలుగు: రీతు డబుల్ గేమ్.. సుమన్ శెట్టి ఫైర్..సంజనతో గొడవ పెట్టుకున్న రాము..ఇంట్రెస్టింగ్ గా నామినేషన్ టాస్క్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నాలుగో వారానికి చేరుకుంది. తొలి మూడు వారాల్లో ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయారు. నాలుగో వారం నామినేషన్ ప్రక్రియను రసవత్తరంగా మార్చాడు బిగ్ బాస్. కెప్టెన్ కు పవర్స్ ఇవ్వడంతో పాటు టాస్క్ పెట్టాడు.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే హౌస్ నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడిక నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. హౌస్ లో వాగ్యాదాలు, డిస్కషన్లు, టాస్క్ లతో రణరంగ వాతావరణం కనిపిస్తోంది.
బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్ (youtube)
బిగ్ బాస్ నామినేషన్స్
బిగ్ బాస్ 9 తెలుగు నాలుగో వారం నామినేషన్స్ కు సంబంధించిన పవర్ ను కెప్టెన్ పవన్ చేతిలో పెట్టాడు బిగ్ బాస్. కెప్టెన్ తీసుకునే నిర్ణయాలే నామినేషన్స్ ఏ దారిలోకి వెళ్తాయన్నది నిర్ణయిస్తాయని బిగ్ బాస్ చెప్తాడు. ఆ తర్వాత పవన్ డైస్ రోల్ చేస్తుంటే కంటెస్టెంట్స్ పావులు కదుపుతారు. వీటిని బట్టి బిగ్ బాస్ టాస్క్ లు పెడుతున్నాడు.
టీమ్ గా కలిసి
బిగ్ బాస్ 9 తెలుగులో నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా జరుగుతోంది. కంటెస్టెంట్లకు టీమ్ ను ఎంచుకునే ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్ టాస్క్ లు పెడుతున్నాడు. సుమన్, రాము రాథోడ్, ఫ్లోరా సైని ఒక టీమ్ కాగా.. తనుజ, రీతు చౌదరి, దివ్య నిఖిత మరో టీమ్. ఈ రెండు టీమ్స్ పోటీపడ్డ దాంట్లో సుమన్ టీమ్ గెలుస్తుంది.
రీతు నామినేషన్
ఓడిపోయిన టీమ్ లో నుంచి ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పగా.. రీతు చౌదరి పేరు చెప్తాడు సుమన్ శెట్టి. ఈ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సుమన్, రీతు ఇద్దరూ ఫైర్ అవుతారు. చివరకు రీతు మెడలో నామినేటెడ్ బోర్డు వేస్తాడు సుమన్. డబుల్ గేమ్ ఆడుతున్నావని రీతుకు ఇచ్చిపడేస్తాడు.
సంజన వర్సెస్ రాము
వీకెండ్ ఎపిసోడ్ నుంచే బిగ్ బాస్ 9 తెలుగులో సంజన వర్సెస్ రాము మధ్య క్లాష్ నడుస్తోంది. చీప్ ఏంట్రా బిడ్డా అంటూ స్టేజీపై నుంచి వార్నింగ్ కూడా ఇచ్చింది సంజన. ఈ నాలుగో వారం సంజనను నామినేట్ చేస్తాడు రాము రాథోడ్. ప్రతి గొడవలోనూ మీరున్నారని సంజనతో డైరెక్ట్ గా అంటాడు. ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు కానీ ఓపిక నేర్చుకుని రా అని సంజన అనగానే.. కించపరిచి మాట్లాడినట్లు ఉందని రాము సీరియస్ అవుతాడు.
మరోవైపు ఫ్లోరా సైనీని భరణి నామినేట్ చేస్తాడు. మరోసారి ఫ్లోరా సైనీ, రీతు డేంజర్ జోన్ లోకి వచ్చారు. మరి వీళ్లు ఓటింగ్ తో సర్వైవ్ అవుతారా? లేదా ఇందులో ఒకరు ఇంటికి వెళ్లిపోతారా? అన్నది చూడాలి.