బిగ్ బాస్ 9 తెలుగు: సిల్లీగా దోశ ఇవ్వలేదని దివ్యను నామినేట్ చేసిన రీతు.. రాముపై సంజన ఫైర్.. ఓటింగ్ టాప్ లో హీరోయిన్
వైల్డ్ కార్డు ఎంట్రీలతో బిగ్ బాస్ 9 తెలుగు పోరు మరో స్థాయికి చేరుకుంది. ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ హోరాహోరీగా సాగింది. ఆరుగురు హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు. వీళ్లలో సీరియల్ హీరోయిన్ ఓటింగ్ లో టాప్ లో ఉంది.
వైల్డ్ కార్డ్స్ వచ్చాక బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ సందడిగా మారింది. పోరు మరింత రసవత్తరంగా మారింది. ఆరో వారం సమరం హోరాహోరీగా సాగుతోంది. నామినేషన్ ప్రక్రియలో ఫైర్ కనిపించింది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఆరో వారం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వాళ్లు ఎవరు? వాళ్ల ఓటింగ్ ఎలా ఉందో చూసేయండి.
రీతు చౌదరి (youtube)
బిగ్ బాస్ 9 నామినేషన్స్
బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. టైమ్ కు దోశ ఇవ్వలేదనే సిల్లీ రీజన్ తో దివ్య నిఖితను రీతు చౌదరి నామినేట్ చేసింది. దోశ ఇవ్వకపోవడం వల్ల ఆకలితో ఉన్నానని, శక్తి కోల్పోయానని రీతు చెప్పడం నవ్వు తెప్పించింది. మరోవైపు రాము రాథోడ్ కు మానవత్వం ఉందా? అని సంజన ఫైర్ అయింది. ఇక భరణి-రీతు మధ్య, భరణి-సంజన మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది.
ఆరుగురు
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఆరో వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్లున్నారు. రాము రాథోడ్, దివ్య నిఖిత, భరణి, డీమాన్ పనవ్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి నామినేట్ అయ్యారు. ఈ ఆరుగురిలో సుమన్ శెట్టి మాత్రమే కాస్త వీక్ కంటెస్టెంట్ గా కనిపిస్తున్నాడు. మిగిలిన అయిదుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే.
బిగ్ బాస్ 9 ఓటింగ్
ఆరో వారం బిగ్ బాస్ 9 ఓటింగ్ ప్రస్తుత పరిస్థితి చూస్తే సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి టాప్ లో కొనసాగుతోంది. ఆమెకు ప్రస్తుతం 33.35 శాతం ఓట్లున్నాయి. మరోవైపు సుమన్ శెట్టికి కూడా ఓటింగ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆయన ఫ్యాన్స్ సుమన్ ను టాప్-2లో ఉంచుతున్నారు. 25.8 శాతం ఓట్లతో సుమన్ శెట్టి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు.
డేంజర్ జోన్లో
గత వారం డేంజర్ జోన్లో ఉండి, లాస్ట్ లో సేవ్ అయిన డీమాన్ పవన్ మరోసారి నామినేషన్లలో ఉన్నాడు. అతను ప్రస్తుతం 13.06 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ వీక్ కూడా అతను సేవ్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఇక సీనియర్ నటుడు భరణి ఓట్ల శాతం తక్కువగా ఉంది. భరణి 9.37 శాతం ఓటింగ్ తో ఉన్నాడు.
ఇక ఈ వారం ప్రస్తుతానికి దివ్య నిఖిత, రాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉన్నారు. రాము 9.24 శాతం, దివ్య నిఖిత 9.23 శాతంతో వరుసగా అయిదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం చూసుకుంటే దివ్య డేంజర్లో ఉంది. ఎలిమినేషన్ కు దగ్గరగా ఉంది. మరి ట్విస్ట్ ఏమైనా ఉంటుందా? లేదా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయి దివ్య ఎలిమినేట్ అవుతుందా? అన్నది చూడాలి.