బిగ్ బాస్ నుంచి ఇవాళ దివ్వెల మాధురి ఎలిమినేట్- అతనికి బదులుగా- మీమర్స్ వల్లే అవుట్- 22 రోజుల్లో ఎంత సంపాదించిందంటే?
బిగ్ బాస్ 9 తెలుగు నుంచి దివ్వెల మాధురి ఎలిమినేట్ అయిపోయింది. దీనికి సంబంధించిన ఎలిమినేషన్ షూటింగ్ శనివారం జరిగిపోయింది. దీనిని ఇవాళ (నవంబర్ 2) ప్రసారం చేయనున్నారు. అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్వెల మాధురి బిగ్ బాస్ రెమ్యునరేషన్, 22 రోజుల్లో సంపాదించింది ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. వీకెండ్‌లో భాగంగా శనివారం వచ్చిన హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ఆట తీరుపై రివ్యూ ఇచ్చారు. ఇక ఎనిమిదోవారం పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నుంచి ప్రతివారం ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్న విషయం తెలిసిందే.

ఎలిమినేట్ అయిన వాళ్లు
అలా ఇప్పటికీ శ్రేష్టి వర్మ, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము, భరణి శంకర్, గత వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ఈ వారం ఎలిమినేట్ అయిన భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చి పర్మనెంట్ హౌజ్‌మేట్‌గా మారాడు.
దాంతో ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరికి బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారం నామినేన్స్ నిర్వహించారు. బిగ్ బాస్ తెలుగు 9 ఈవారం నామినేషన్స్‌లో మొత్తంగా 8 మంది ఉన్నారు. వారిలో తనూజ గౌడ, కల్యాణ్ పడాల, రీతూ చౌదరి, గౌరవ్ గుప్తా, డీమాన్ పవన్, రాము రాథోడ్, సంజన గల్రానీ, దువ్వాడ మాధురి ఉన్నారు.
బిగ్ బాస్ ఓటింగ్
నామినేషన్స్ పూర్తి అయినప్పటి నుంచి బిగ్ బాస్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. వారిలో వీకెండ్ వచ్చేసరికి చివరి రెండు స్థానాల్లో గౌరవ్ గుప్తా, దివ్వెల మాధురి మిగిలారు. ఈ ఇద్దరికి ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహించగా దివ్వెల మాధురి ఎలిమినేట్ అయింది. దీనికి సంబంధించిన ఎలిమినేన్ షూటింగ్ శనివారం (నవంబర్ 1) నాడే జరిగిపోయింది.
ఇవాళ (నవంబర్ 2) దివ్వెల మాధురి ఎలిమినేషన్‌ను ప్రసారం చేయనున్నారు. అయితే, దివ్వెల మాధురికి రెమ్యునరేషన్ కింద వారానికి రూ. 40 వేలు ఇచ్చినట్లు సమాచారం. వైల్డ్ కార్డ్‌గా అక్టోబర్ 12న బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ 2.Oతో ఎంట్రీ ఇచ్చిన మాధురి హౌజ్‌లో 22 రోజులు ఉంది.
దివ్వెల మాధురి రెమ్యునరేషన్
ఈ లెక్కన 3 వారాలు హౌజ్‌లో ఉన్న బిగ్ బాస్ మాధురి సుమారుగా లక్ష 20 వేల రూపాయలు లేదా రూ. 1, 25000 సంపాదించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, మిడ్ వీక్ బిగ్ బాస్ ఓటింగ్‌లో మాధురు ఆరో స్థానంలో ఉంది. కానీ, వీకెండ్ వచ్చేసరికి అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. గౌరవ్ ఎలిమినేట్ అవ్వడానికి బదులు మాధురి అయిందని టాక్ వస్తోంది.
ఇందుకు కారణం మీమర్స్ అని అంటున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో భరణి శంకర్, మాధురిని లింక్ చేస్తూ లవ్ రిలేషన్‌షిప్ పోస్ట్‌లు, లవ్ బీజీఎమ్స్‌తో, రొమాంటిక్ యాంగిల్‌లో మీమ్స్ తెగ పడ్డాయి. ఎలిమినేట్ అయిన భరణి శంకర్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో అవి మరింత జోరందుకున్నాయి.
మీమర్స్ వల్ల
అంతేకాకుండా సోషల్ మీడియాలో భరణి, మాధురి మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి. ఈ మీమ్స్, మీమర్స్ క్రియేటివిటీ కారణంగానే మాధురి ఎలిమినేట్ అయిందని పలువురు రివ్యూవర్స్ సరాదాగా చెబుతున్నారు. కాగా, రియల్ లైఫ్‌లో దువ్వాడ శ్రీనివాస్‌తో మాధురి రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


