బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు- రెండో ప్లేసులోకి పడిపోయిన సీరియల్ హీరోయిన్- ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్ బాస్ 9 తెలుగు ఎనిమిదో వారానికి చేరుకుంది. ఈ వారంలో ఎలిమినేట్ కంటెస్టెంట్స్ ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌ను ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నిర్వహించారు. నామినేషన్లలో 8 మంది ఉన్నారు. మరి బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

Oct 30, 2025, 13:24:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. ఎనిమిదో వారానికి చేరుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడు లేని డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో రంజుగా సాగుతోంది. బిగ్ బాస్‌లో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ కంటెస్టెంట్స్ శ్రీజ దమ్ము, భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్- రెండో ప్లేసులోకి పడిపోయిన సీరియల్ హీరోయిన్- ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?
తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్- రెండో ప్లేసులోకి పడిపోయిన సీరియల్ హీరోయిన్- ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

పర్మనెంట్‌గా భరణి శంకర్

వీరిలో భరణి శంకర పర్మనెంట్ హౌజ్‌మేట్‌గా కన్ఫర్మ్ అయ్యారు. ఓ టాస్క్ ద్వారా భరణిని బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్‌గా రీ ఎంట్రీ ద్వారా చేశారు. అలాగే, ఈ వారం బిగ్ బాస్‌లో నామినేషన్స్ ప్రక్రియను ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో నిర్వహించారు. కత్తులతో పొడిచే టాస్క్‌తో బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారం నామినేషన్స్ జరిగాయి.

బిగ్ బాస్ నామినేషన్స్‌లో 8 మంది

ఎనిమిదో వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్‌లో మొత్తంగా 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో తనూజ గౌడ, కల్యాణ్ పడాల, రీతూ చౌదరి, గౌరవ్ గుప్తా, డీమాన్ పవన్, రాము రాథోడ్, సంజన గల్రానీ, దివ్వెల మాధురి ఉన్నారు. వీరిందరికి నామినేషన్స్ అనంతరం ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి.

ఓటింగ్ తారుమారు

అయితే, బిగ్ బాస్ ఓటింగ్‌లో ఎప్పుడు సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి టాప్ 1లో నిలిచేది. కానీ, ఈసారి బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు అయి తనూజ గౌడ రెండో ప్లేస్‌లోకి పడిపోయింది. 25.6 శాతం ఓటింగ్, 17,576 ఓట్లతో కల్యాణ్ పడాల టాప్ 1 స్థానంలో కల్యాణ్ పడాల దూసుకుపోతున్నాడు.

ఎవరికెంత ఓటింగ్

అతని తర్వాత రెండో ప్లేసులో తనూజ గౌడ 20.8 శాతం ఓటింగ్, 14,281 ఓట్లతో ఉంది. ఇక మూడో స్థానంలో సంజన గల్రానికి 17.19 శాతం ఓటింగ్ (11,807 ఓట్లు), రీతు చౌదరి 15.33 శాతం ఓటింగ్ (10,527 ఓట్లు)తో నాలుగో ప్లేసులో, 15.33 శాతం ఓటింగ్ (3,809 ఓట్లు)తో ఐదో స్థానంలో రాము రాథోడ్ ఉన్నాడు.

ఎలిమినేషన్‌కు దగ్గరిగా

ఇక 5.24 శాతం ఓటింగ్ (3,601 ఓట్లు)తో ఆరో ప్లేసులో దివ్వెల మాధురి, 5.15 శాతం ఓటింగ్ (3,538 ఓట్లు)తో డీమాన్ పవన్ ఏడో స్థానంలో ఉన్నారు. ఇక చిట్ట చివరి స్థానమైన 8 ప్లేసులో అందరికంటే తక్కువగా 5.14 శాతం ఓటింగ్ (3,527 ఓట్లు)తో గౌరవ్ గుప్తా ఉన్నాడు. అంటే ఎలిమినేషన్‌కు దగ్గరిగా గౌరవ్ గుప్తా ఉన్నాడు.

చివరి రెండు స్థానాల్లో

చివరి రెండు ప్లేసుల్లో ఉన్నవారు సాధారణంగా డేంజర్ జోన్‌లో ఉంటారు. ఈ ఓటింగ్ లెక్కల ప్రకారం డీమాన్ పవన్, గౌరవ్ చివరి రెండు స్థానాలతో డేంజర్ జోన్‌లో నిలిచారు.

ఓటింగ్ మారితే

కానీ, వీరిలో అందరికంటే తక్కువ ఓట్లు ఉన్న గౌరవ్ ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్‌లో మార్పుతో ఎలిమినేషన్ నుంచి బయటపడే ఛాన్స్ కూడా ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More