పవన్‌తో పులిహార ఎందుకు కలిపావ్? బిగ్ బాస్ బజ్‌లో హీరో శివాజీ ప్రశ్నలు.. ఎలిమినేట్ అయిన రమ్య మోక్షకు ముచ్చెమటలు!

బిగ్ బాస్ 9 తెలుగు ఏడో వారం ఎలిమినేట్ కంటెస్టెంట్ రమ్య మోక్షకు హీరో శివాజీ ప్రశ్నలతు ముచ్చెమటలు పట్టించాడు. ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ తెలుగు సీజన్ 9 ఇంటర్వ్యూలో పాల్గొన్న అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య మోక్ష మాజీ కంటెస్టెంట్ శివాజీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయింది.

Published on: Oct 27, 2025, 14:36:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కామనర్స్, సెలబ్రిటీలు అంటూ జోరుగా సాగుతోంది. ఇక గత వారం అంటే, బిగ్ బాస్ తెలుగు 9 ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. చిట్టి అలేఖ్య పికిల్స్ ద్వారా పాపులర్ అయిన రమ్య మోక్ష బిగ్ బాస్ హౌజ్‌లో సుమారు 15 రోజులు మాత్రమే ఉంది.

పవన్‌తో పులిహార ఎందుకు కలిపావ్? బిగ్ బాస్ బజ్‌లో హీరో శివాజీ ప్రశ్నలు.. ఎలిమినేట్ అయిన రమ్య మోక్షకు ముచ్చెమటలు!
పవన్‌తో పులిహార ఎందుకు కలిపావ్? బిగ్ బాస్ బజ్‌లో హీరో శివాజీ ప్రశ్నలు.. ఎలిమినేట్ అయిన రమ్య మోక్షకు ముచ్చెమటలు!

రమ్య మోక్షకు ముచ్చెమటలు

ఇక ఎలిమినేట్ అయిన వాళ్లతో హీరో, మాజీ కంటెస్టెంట్ శివాజీ హోస్ట్‌గా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ తెలుగు సీజన్ 9 ఉంటుందని తెలిసిందే. ఈ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య మోక్షకు హీరో శివాజీ తన ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టించినంత పని చేశాడు.

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలోకి రమ్య మోక్ష రాగానే చప్పట్లు కొట్టాడు శివాజీ. "సౌండ్ వచ్చిందా" అని శివాజీ అడిగితే "వచ్చింది సర్" అని రమ్య చెప్పింది. తర్వాత శివాజీ విజిల్ వేశాడు. "సౌండు ఇక్కడ బాగా వినపడిందా, అక్కడ (హౌజ్‌లో) బాగా వినపడిందా" అని శివాజీ అడిగాడు. "ఇక్కడే బాగా వినిపించింది సర్" అని రమ్య చెప్పింది.

లోపల కూడా ఏం చూడలేదా

తర్వాత స్క్రీన్‌పై తాబేలు చూపిస్తే.. రాము అని రమ్య చెప్పింది. తర్వాత చిరుత పులిని చూపిస్తే గౌరవ్ అని చెప్పింది రమ్య. "ఆర్ యూ షూర్" అని శివాజీ అన్నాడు. అవును అని రమ్య బదులిచ్చింది. "బయట ఉన్నప్పుడు ఎపిసోడ్స్ చూడలేదనుకున్నా కానీ లోపల కూడా ఏం అబ్జర్వ్ చేయలేదమ్మడు" అని శివాజీ వెటకారంగా అన్నాడు.

"హౌజ్‌లో మీరే నెగెటివ్ అని అందరూ అన్నారు" అని శివాజీ అంటే.. "అందరు అనలేదు సర్. ఇద్దరు అన్నట్లున్నారు. అది వాళ్ల ఆలోచన" అని రమ్య తెలిపింది. "ఆదిగారు వచ్చినప్పుడు మీకో హింట్ ఇచ్చారు ఏం జరుగుతుంది అని. చాలా యాటిట్యూడ్‌తోటి థాంక్యూ" అనడమేంటీ అన్నట్లుగా శివాజీ అడిగాడు.

ఆ రీచే ఇక్కడికి తెచ్చింది

"అలా రీచ్ అయింటదేమో" అని రమ్య మోక్ష అంటుంటే.. "ఆ రీచ్ రీచ్ అంతకూడా మీరు ఇక్కడికి రీచ్ అయ్యేలా చేసింది" అని శివాజీ అన్నాడు. దాంతో రమ్య మోక్ష మొహం మాడ్చుకున్నట్లు ఎక్స్‌ప్రెషన్ పెట్టింది. "హౌజ్‌కు మీరు కరెక్ట్ కాదని మీకు అనిపించిందా. మీరు బాండ్ క్రియేట్ చేసుకోడానికి సుమన్ గారికి దగ్గరిగా ఉన్నారా అని కొందరు అడుగుతున్నారు" అని శివాజీ అన్నాడు.

"ఎవరైతే లోగా ఉంటే వాళ్లతో ఉండాలనిపిస్తుంది" అని రమ్య తెలిపింది. "మీరు ఓదార్పు యాత్రకు వెళ్లారా. కల్యాణ్ తనూజ ఇద్దరు లవర్స్ అని చెప్పారా. మీకు అనిపించి చెబితే ఒక అమ్మాయి అబ్బాయి మీద ముద్ర పడుద్దిగా. పవన్‌తో పులిహార కలపడం ఎందుకు స్టార్ట్ చేశావ్" అని శివాజీ అడిగాడు.

పవనే ఇష్టం

"నేను పవన్‌తో పులిహార ఏం కలపలేదు సర్" అని రమ్య అంటే.. వీడియో ప్లీజ్ అని శివాజీ అన్నాడు. "నీకు ఎవరు నచ్చారు ఫస్ట్" అని ఎవరో అడుగుతుంతే "పవనే ఛాలెంజ్ చేశాడు. పవనే ఇష్టం" అని అతని ముందు రమ్య చెప్పిన వీడియోను ప్లే చేశారు. అక్కడితో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ బజ్ ఇంటర్వ్యూ ముగిసింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More