బిగ్ బాస్ తెలుగు 9లోకి ఇద్దరు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్- ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది- ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే?
బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్ జోరుగా సాగాయి. బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారం నామినేషన్స్ ఎపిసోడ్ ఆదివారం నాడు పూర్తి అయిపోయింది. అయితే, ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ నామినేషన్స్ జరిగాయి. ఈ వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్‌లో 8 మంది నామినేట్ అయ్యారు. మరి వారెవరో చూద్దాం.
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. వైల్డ్ కార్డ్‌లు ఎంట్రీలు, ఎలిమినేషన్స్, మళ్లీ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ రీ ఎంట్రీలతో రకరకాలుగా సాగిపోతుంది బిగ్ బాస్ 9 తెలుగు. బిగ్ బాస్ న్యూ సీజన్ ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. ఇక వారం ప్రారంభం అయిందంటే చాలు హౌజ్‌లో నామినేషన్స్ గొడవలతో హౌజ్‌లో రచ్చ జరుగుతుంది.

బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్
బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్ కూడా అలాగే గొడవలు, అరుపులు, ఆర్గ్యుమెంట్లతో సాగింది. అయితే, ఈ వారం బిగ్ బాస్ 9 తెలుగు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్ నిర్వహించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్లతో 8వ వారం నామినేషన్స్ చేయించారు. అందుకు కత్తితో పొడిచే ప్రక్రియ పెట్టారు.
కెప్టెన్ మినహా మిగతా హౌజ్ మేట్స్ అంతా గార్డెన్‌లో ఒక బోర్డ్ తగిలించుకుని కూర్చుంటారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ దగ్గర రెండు కత్తులు ఉంటాయి. అందులో ఒక కత్తితో వారు నేరుగా నామినేట్ చేస్తారు. ఇంకో కత్తిని హౌజ్‌లో ఉన్న ఒక ఇంటి సభ్యుడికి ఇస్తారు. దాంతో వారు మరొకరిని నామినేట్ చేయాలి.
ఒక్కొక్కరి నామినేషన్
కల్యాణ్‌ను శ్రీజ దమ్ము, మనీష్ మర్యాద నామినేట్ చేశారు. సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామిని జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్ నామినేట్ చేశాడు. ఈ క్రమంలో తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయెల్ గొడవ జరిగింది. అలాగే, దివ్వెల మాధురి, శ్రీజ మధ్య కూడా గొడవ అయింది. తర్వాత రాము రాథోడ్‌ను కల్యాణ్ నామినేట్ చేశాడు.
కల్యాణ్‌కు ప్రియా శెట్టి కత్తి ఇచ్చింది. దాంతో కల్యాణ్ నామినేట్ చేశాడు. ఇమ్మాన్యుయెల్‌కు మనీష్ మర్యాద కత్తి ఇవ్వడంతో తనూజను నామినేట్ చేశాడు. సంజనను సుమన్ శెట్టి నామినేట్ చేశాడు. అతనికి ఫ్లోరా సైని అలియాస్ ఆశా సైని కత్తి ఇచ్చింది. ఇక ఫ్లోరా సైని జబర్దస్త్ బ్యూటి రీతూ చౌదరిని నామినేట్ చేసింది.
ఇమ్యూనిటీ పవర్ ఉపయోగించి
అనంతరం సంజనను భరణి శంకర్ నామినేట్ చేసి రెండో కత్తిని నిఖిల్‌కు ఇచ్చాడు. దాంతో తనూజ గౌడను నిఖిల్ నామినేట్ చేశాడు. కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ డిమోన్ పవన్‌ను నామినేట్ చేసి ఇంకో కత్తిని రాము రాథోడ్‌కు అందించింది. అతను గౌరవ్ గుప్తాను నామినేట్ చేశాడు.
ఇక వీరందరిలో సాయి శ్రీనివాస్ తన దగ్గరున్న ఇమ్యూనిటీ పవర్ ఉపయోగించుకుని నామినేషన్స్ సేఫ్ అయ్యాడు. ఇక ఫైనల్‌గా బిగ్ బాస్ తెలుగు 9 ఎనిమిదో వారం నామినేషన్స్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో దివ్వెల మాధురి, తనూజ, రీతూ చౌదరి, రాము రాథోడ్, గౌరవ్, సంజన, డిమోన్ పవన్, కల్యాణ్ ఉన్నారు.
ఇద్దరు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ
బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్ షూటింగ్ ఆదివారం (అక్టోబర్ 26) అయిపోయింది. ఆ ప్రక్రియను నేడు ఎపిసోడ్‌లో ప్రసారం చేయనున్నారు. ఇక ఎంట్రీ ఇచ్చిన ఎలిమినేట్ కంటెస్టెంట్స్ అంతా వెళ్లిపోయారు. ఇవాళ లేదా రేపు ఎలిమినేట్ అయిన వాళ్లలో ఇద్దరు మళ్లీ కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


