Sign in

తేరే ఇష్క్ మే రివ్యూ: ధనుష్, కృతి సనన్ డిఫరెంట్ లవ్ స్టోరీ-హీరోపై హీరోయిన్ ప్రయోగాలు-సినిమా ఎలా ఉందంటే?

ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ‘తేరే ఇష్క్ మే’ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన ఈ డిఫరెంట్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉందో రివ్యూలో చూసేయండి.

Published on: Nov 28, 2025, 16:57:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మూవీ: తేరే ఇష్క్ మే; దర్శకుడు: ఆనంద్ ఎల్. రాయ్; నటీనటులు: ధనుష్, కృతి సనన్; రిలీజ్ డేట్: నవంబర్ 28, 2025; రేటింగ్:3/5

తేరే ఇష్క్ మే సినిమా పోస్టర్ లో ధనుష్, కృతి సనన్
తేరే ఇష్క్ మే సినిమా పోస్టర్ లో ధనుష్, కృతి సనన్

కబీర్ సింగ్, సైయారా లాంటి సినిమాలు డిఫరెంట్ లవ్ స్టోరీతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇప్పుడు ఆ చిత్రాలను మంచి అదరగొట్టేందుకు మరో డిఫరెంట్ లవ్ స్టోరీ ‘తేరే ఇష్క్ మే’ వచ్చింది. తమిళ స్టార్ హీరో ధనుష్.. హిందీలో చేసిన మరో సినిమా ఇది. ఇందులో కృతి సనన్ హీరోయిన్. మరి ఇవాళ రిలీజైన సినిమా ఎలా ఉందో ఇక్కడ రివ్యూలో చూద్దాం.

తేరే ఇష్క్ మే కథ

శంకర్ గురుక్కల్ (ధనుష్) ఓ ఎయిర్ ఫోర్స్ పైలట్. క్రమశిక్షణారాహిత్యం కారణంగా సస్పెండ్ అవుతాడు. అప్పుడు అతని మానసికి స్థితిని పరీక్షించేందుకు సైకాలజిస్ట్ ముక్తి భేనివాల్ (కృతి సనన్) వస్తుంది. వీళ్లకు గతం ఉంటుంది. ఏడేళ్ల క్రితం వీళ్లు ప్రేమించుకుంటారు. శంకర్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతుంటాడు. అతనికి ముక్కు మీద కోపం ఉంటుంది. చాలా వైలెంట్ గా ఉంటాడు.

అప్పుడే అదే కాలేజీలోకి పీహెచ్డీ స్టూడెంట్ గా ముక్తి వస్తుంది. ఎంతటి హింసాత్మక స్వభావం ఉన్న మనిషినైనా సరైన ట్రీట్మెంట్ మార్చవచ్చన్నది ఆమె థీసిస్ ఉద్దేశం. తన థీసిస్ ను రుజువు చేసేందుకు శంకర్ ను పరిశోధనా అంశంగా ఎంచుకుని, అతనిపై ప్రయోగాలు చేస్తుంది. ఈ క్రమంలో ముక్తిని ప్రేమించిన శంకర్ మారిపోతాడు.

ఆ ట్విస్ట్

ముక్తిని గాఢంగా ప్రేమిస్తాడు శంకర్. ముక్తి కూడా తిరిగి లవ్ చేస్తుంది. కానీ తన థీసిస్ కోసం శంకర్ ను ప్రేమించినట్లు ముక్తి నాటకం ఆడిందా? అనే విషయంలో శంకర్ కు నిజం తెలుస్తుంది. మరోవైపు ముక్తి కూడా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. దీంతో పగతో రగిలిపోయిన శంకర్ ఢిల్లీ మొత్తాన్ని బూడిద చేస్తానని ప్రతిజ్ణ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది సినిమాలో చూడాల్సిందే.

మూవీ ఎలా ఉందంటే?

తేరే ఇష్క్ మే సినిమాలో హీరో, హీరోయిన్ తీవ్రమైన కళాశాల ప్రేమకథ, అతని దూకుడును సంస్కరించడానికి ఆమె ప్రయత్నం, అతని వర్తమానాన్ని తీర్చిదిద్దిన హృదయ విదారక సంఘటనలు ఈ కథలో ఉన్నాయి. మొదటి సగంలో మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెట్టే స్క్రీన్‌ప్లేను రూపొందించినందుకు రచయితలు హిమాన్షు శర్మ, నీరజ్ యాదవ్ లకు క్రెడిట్ దక్కుతుంది. డైరెక్టర్ ఆనంద్ మిమ్మల్ని తన ప్రపంచంలోకి లోతుగా లాగుతాడు.

కథ బాగా నడుస్తుంది, కానీ విరామానికి దగ్గరయ్యే కొద్దీ అదుపు తప్పుతున్నట్లు కనిపిస్తోంది. అకస్మాత్తుగా కథనం శంకర్, ముక్తి తండ్రి మధ్య బెట్టింగ్ వైపు మారుతుంది. సెకండాఫ్ లో పట్టు బలహీనపడుతుంది. కొన్ని గందరగోళ పరిస్థితులకు దారితీస్తుంది. ఎడిటింగ్ టేబుల్‌పై కొన్ని ట్రిమ్మింగ్‌లు సహాయపడతాయని మీరు భావించేలా చేస్తుంది. క్లైమాక్స్ 'రాంజనా'ను గుర్తు చేస్తుంది.

ధనుష్ యాక్టింగ్

తేరే ఇష్క్ మే సినిమాలో ధనుష్ అద్భుతంగా నటించాడు. అతను 'రాంజనా'లోని కుందన్ కంటే భిన్నంగా ఉన్నాడు. శంకర్ గా ఎమోషనల్ స్వింగ్ లను గొప్పగా ప్రదర్శఇంచాడు. కృతి సనన్‌తో అతని కెమిస్ట్రీ బాగా కుదిరింది. కృతి సనన్‌ నటన కూడా ఆకట్టుకునేలా ఉంది. ఆమె తెరపై వెలుగులు విరజిమ్ముతుంది. ఆమె చూడటానికి అందంగా ఉంది. అవును, కానీ అంతకంటే ముఖ్యంగా ఆమె సంక్లిష్టమైన పాత్రకు బరువును తెస్తుంది. చివరగా సెకండాఫ్ లో కాస్త పట్టు తప్పడం మినహా తేరే ఇష్క్ మే సినిమా అంతటా మెప్పిస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More