ఆంధ్రా కింగ్ తాలూకా రివ్యూ.. డై హార్డ్ ఫ్యాన్‌గా రామ్ పోతినేని, సూపర్ స్టార్‌గా ఉపేంద్ర.. భాగ్యశ్రీ మూవీ ఎలా ఉందంటే?
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. ఇవాళ (నవంబర్ 27) థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి ఆంధ్రా కింగ్ తాలూకా రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: ఆంధ్రా కింగ్ తాలూకా

నటీనటులు: రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర, రాహల్ రవీంద్రన్, రావు రమేశ్, మురళీ శర్మ, రాజీవ్ కనకాల, తులసి, వీటీవీ గణేష్, సత్య తదితరులు
దర్శకత్వం: పి. మహేష్ బాబు
సంగీతం: వివేక్-మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నూని, జార్జ్ సి, విలియమ్స్
ఎడిటింగ్: ఏ శ్రీకర్
నిర్మాత: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్
విడుదల తేది: 27 నవంబర్ 2025
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, బ్యూటిపుల్ భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహించారు. ఇవాళ (నవంబర్ 27) థియేటర్లలో ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఆంధ్రా కింగ్ తాలూకా రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
సూర్య (ఉపేంద్ర) ఓ సూపర్ స్టార్. ఫ్యాన్స్ అతన్ని ఆంధ్రా కింగ్ అని పిలుచుకుంటారు. అయితే సూర్య ప్రతిష్టాత్మకమైన వందో సినిమా అర్థాంతరంగా ఆగిపోతుంది. అందుకు రూ. 3 కోట్లు రావాల్సి వస్తుంది. కానీ, సూర్యకు ఎవరు సహాయం చేయరు.
అలాంటి సమయంలో సూర్య అకౌంట్‌లో సాగర్ (రామ్ పోతినేని) అనే అభిమాని నుంచి 3 కోట్లు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఒక ఫ్యాన్ తనకోసం అంత డబ్బు పంపాడని తెలిసి సాగర్ గురించి తెలుసుకోవాలని సూర్య బయలుదేరుతాడు.
సాగర్ గురించి సూర్య ఎలాంటి విషయాలు తెలుసుకున్నాడు? అసలు సూర్య 100వ సినిమా ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర ప్రభావం సాగర్‌పై ఎలా పడింది? హీరో కోసం సాగర్ చేసిన త్యాగం ఏంటీ? సాగర్‌ను ప్రేమించిన మహాలక్ష్మీ కథ ఏంటీ? సాగర్-మహాలక్ష్మీ లవ్ చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే? ఈ ఆంధ్రా కింగ్ తాలూకా చూడాల్సిందే.
విశ్లేషణ:
హీరో, అభిమాని మధ్య నడిచే కథే ఈ సినిమా. ఇలాంటి టైప్ కథను జీరో సినిమాలో చూశాం. కానీ, ఆంధ్రా కింగ్ తాలూకా మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇది ఒక అభిమాని జీవిత కథ అని చెప్పొచ్చు. హీరో, ఫ్యాన్ మధ్య ఉన్న బంధానికి రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీని యాడ్ చేసి ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్దిన సినిమానే ఇది.
ఆంధ్రా కింగ్ తాలూకా టేకింగ్ విషయంలో డైరెక్టర్‌ను మెచ్చుకోవాల్సిందే. స్ట్రాంగ్ రైటింగ్‌తో మంచి ఫీల్ గుడ్ నెరేషన్‌తో సినిమా సాగుతుంది. ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 90, 2000 సమయంలో హీరోలపై అభిమానులు చూపించిన అభిమానం, అప్పటి వాతావరణం, తారల సందడి అన్నింటిని పర్ఫెక్ట్‌గా చూపించారు.
సర్వస్వం అనుకునే వరకు
సూర్య వందో సినిమా ఆగిపోవడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఒక హీరోను ఓ అభిమాని మొదటగా చూసి తనే సర్వస్వం అనుకునేలా ఎలా మారాడు అనే చూపించిన విధానం ప్రతి ఫ్యాన్ తనలో తాను చూసుకుంటాడు. ఇది డై హార్డ్ ఫ్యాన్‌కే సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడుకి కనెక్ట్ అవుతుంది.
హీరో, ఫ్యాన్ బాండింగ్ ఒకవైపు ఎమోషనల్‌గా అలరిస్తే మరోవైపు సాగర్, మహాలక్ష్మీ లవ్ ట్రాక్ మనసుకు తాకుతుంది. ఫస్టాఫ్‌లో ప్రేమ, పెరిగిన ఊరు గురించి సాగర్ తీసుకునే నిర్ణయం హైలెట్ అవుతుంది. ఇక సెకండాఫ్‌లో ఊరందరని ఒక్కటి చేసి 3 కోట్ల కోసం సాగర్ చేసే త్యాగం కట్టిపడేస్తుంది.
ఊహించే సీన్స్
పైకి హీరో, అభిమాని కథగా సినిమా ఉన్న దానితోపాటు లవ్ స్టోరీ, నేలకథ వంటి మూడు లేయర్స్ ఉన్నాయి. అయితే, కొన్ని చోట్ల ఊహించేలా సీన్స్ ఉన్నాయి. క్లైమాక్స్ బాగుంది. ఇకపోతే రామ్ పోతినేని అభిమానిగా అదరగొట్టాడు. అభిమానిలాగా పరాకాయ ప్రవేశం చేశాడు.
ఎనర్జీతోపాటు ఎమోషనల్ సీన్స్‌లో రామ్ కట్టిపడేశాడు. సూపర్ స్టార్ సూర్యగా ఉపేంద్ర నటన నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ఉపేంద్ర యాక్టింగ్ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. కనిపించేది కాసేపైన ఇంపాక్ట్ చేసేలా ఉంటుంది. ఇక భాగ్యశ్రీ బోర్సే మరోసారి తన నటనతో మెప్పించింది. రెట్రో లుక్‌లో అచ్చమైన గ్రామీణ యువతిగా అలరించింది.
అభిమానికి కనెక్ట్ అయ్యే కథ
రామ్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. మిగతా పాత్రలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నాయి. అదిరిపోయే విజువల్స్‌తో సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం, పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. డైరెక్టర్ మహేశ్ బాబు రైటింగ్ బాగుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ప్రతి అభిమానికి కనెక్ట్ అయ్యే మూవీ ఈ ఆంధ్రా కింగ్ తాలూకా.
రేటింగ్: 3.5/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


