అరుంధతిలో అనుష్క లాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది, అందరికి ఇలాంటి సపోర్ట్ ఉండదు: ఆంధ్రా కింగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే
రామ్ పోతినేని హీరోగా కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. ఈ సినిమాలో హీరోయిన్‌గా బ్యూటిపుల్ భాగ్యశ్రీ బోర్సే యాక్ట్ చేసింది. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన మీడియా ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'తో అలరించేందుకు రెడీగా ఉన్నాడు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు.

జోడీగా బ్యూటిపుల్ భాగ్యశ్రీ బోర్సే
ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా బ్యూటిపుల్ భాగ్యశ్రీ బోర్సే చేసింది. ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
రామ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-రామ్ గారితో నటించడం అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ . వెరీ ఎనర్జిటిక్ పెర్ఫార్మర్. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేశానని అనుకుంటున్నాను. లవ్ స్టొరీ, డైలాగ్స్ చాలా బ్యూటిపుల్‌గా ఉంటాయి. రామ్ పోతినేని గారు చాలా పాజిటివ్‌గా ఉంటారు.
ఈ సినిమాలో మీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి?
-ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఆల్బమ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పాటలన్నీ ఇష్టం. అయితే నాకు ఫేవరెట్ నువ్వుంటే చాలు.
ఇది పీరియడ్ సినిమా కదా కాస్ట్యూమ్స్ పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు?
-ఇది 2000లో జరిగే కథ, డైరెక్టర్ గారు కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ అన్నిటి పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇందులో మీకు చాలెంజింగ్‌గా అనిపించినా సీక్వెన్స్ ఉందా?
-ఇందులో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంది. డైరెక్టర్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నేను ఎలా అనుకుంటున్నానో చేసి చూపిస్తానని డైరెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాను. నేను చేసింది అందరికీ నచ్చింది. అంత క్రియేటివ్ స్పేస్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది.
మైత్రి మూవీ మేకర్స్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-రవి గారు, నవీన్ గారు నేను కలిసిన ఫస్ట్ ప్రొడ్యూసర్స్. వాళ్లతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. ఈ సినిమాతో వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. చాలా పాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తీశారు.
షూటింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి?
-ఒక షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్లాం. అక్కడ చాలా వేడిగా ఉంది. అయితే ఒక టీమ్‌గా సినిమా కోసం వర్క్ చేయడంలో చాలా ఎంజాయ్ చేశాం. ఈ సినిమాలో తులసి గారు రావు రమేష్ గారు మురళి శర్మ గారు ఇలా అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు. వాళ్లందరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. రావు రమేష్ గారి పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంటుంది. అలాగే రాహుల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది.
మీరు ఫ్యూచర్‌లో ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు?
-నాకోసం ఎలాంటి కథలు రాసిపెట్టి ఉన్నాయో నాకు తెలియదు. అయితే వచ్చిన ప్రతి క్యారెక్టర్‌కి 100% ఇచ్చి ఒక వెర్సటైల్ నటిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. అనుష్క శెట్టి గారు అరుంధతి సినిమాలో చేసినటువంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అలాంటి పాత్రలు నాకు వస్తాయని ఆశిస్తున్నాను.
మీరు చేసిన రెండు సినిమాలకే చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది?
-ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ ఇలాంటి సపోర్టు ఉండదు. అందరూ కూడా తమ అమ్మాయిగా అభిమానాన్ని చూపించారు. ఇలాంటి అభిమానం గౌరవం ప్రేమ మరింత పొందాలని కోరుకుంటున్నాను.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


