అభిమానం అనేది పవిత్రమైన ఎమోషన్, మహేష్ బాబు ద్వారా సమాధానం దొరికింది.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్
కాంత సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే యాక్ట్ చేస్తున్న మరో మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ పోతినేని హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర ఆన్‌స్క్రీన్ హీరోగా చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన మీడియా ఇంటర్వ్యూలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.
రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌లో మెరిసిన బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే ఇటీవల వచ్చిన దుల్కర్ సల్మాన్ కాంత మూవీలో నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

ఆన్‌స్క్రీన్ హీరోగా ఉపేంద్ర
తాజాగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఆన్‌స్క్రీన్ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు.
భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ విషయాలు
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
ముందుగా కంగ్రాజులేషన్స్. కాంత సినిమాకి, మీ పర్ఫామెన్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎలా అనిపించింది?
-చాలా ఆనందంగా అనిపించింది. ప్రేక్షకులు నటిగా నాలో ఉన్న పొటెన్షియల్ చూశారు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే.
ఆంధ్ర కింగ్‌లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-ఆంధ్ర కింగ్‌లో నేను మహాలక్ష్మి క్యారెక్టర్‌లో కనిపిస్తాను. తను కాలేజ్ గోయింగ్ గర్ల్. సాగర్‌తో ప్రేమలో ఉంటుంది. అంతకుమించి ఇప్పుడు ఎక్కువ క్యారెక్టర్ గురించి రివీల్ చేయకూడదు. కథలో తన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఈ క్యారెక్టర్ ఆడియన్స్ గుర్తుపెట్టుకునేలా ఉంటుంది.
మహేష్ గారు ఈ కథ చెప్తున్నప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమిటి?
-అభిమానం అనేది డివైన్ ఎమోషన్. నేను నార్త్ నుంచి సౌత్‌కి వచ్చినప్పుడు ఇక్కడ అభిమానుల అభిమానం చూసిన తర్వాత ఒక స్టార్‌ని ఎంత గొప్పగా ఆరాధిస్తారో ప్రేమిస్తారో ప్రత్యక్షంగా చూశాను. అది నిజంగా చాలా గొప్ప ఎమోషన్.
-ఎలాంటి రిలేషన్ లేకుండా పరిచయం లేకుండా ఒక వ్యక్తిని అంతలా ఎలా అభిమానిస్తారు అనిపించేది. మహేష్ బాబు ఈ కథ చెప్పిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది.
ఉపేంద్ర గారితో మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా?
-ఒక కాంబినేషన్ సీన్ ఉంది. ఆయన వెరీ హంబుల్ యాక్టర్. చాలా డౌన్ టు ఎర్త్. ఆయనతో వర్క్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
సాగర్ మహాలక్ష్మి లవ్ స్టోరీ ఎంత కొత్తగా ఉండబోతుంది?
-ఇందులో ప్రేమ కథ చాలా స్వచ్ఛంగా ఉండబోతుంది. నువ్వుంటే చాలు, చిన్ని గుండెలో పాటలు మీరు చూసే ఉంటారు. ప్రేమలో ఉన్న గొప్ప ఎమోషన్ ఇందులో ఉంటుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


