ఇది ఓ అభిమాని బయోపిక్.. అదిరిపోయిన ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్.. హీరో వీరాభిమాని పాత్రలో రామ్ పోతినేని
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ట్రైలర్ మంగళవారం (నవంబర్ 18) రిలీజైంది. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్ వచ్చేసింది. ఓ అభిమాని బయోపిక్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి హీరో అభిమాని తన సినిమా అని చెప్పుకునే విధంగా ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అభిమాని కోసం కదిలి వచ్చే హీరో కథ ఇది.

ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ పోతినేని తీసిన మరో మాస్ ఎంటర్టైనర్ ఆంధ్రా కింగ్ తాలూకా. ఓ హీరో, అతని వీరాభిమాని చుట్టూ తిరిగే కథతో ఈ మూవీ వస్తోంది. ఇందులో సాగర్ అనే అభిమాని పాత్రలో రామ్ కనిపించగా.. ఆంధ్రా కింగ్ సూర్య అనే హీరో పాత్రలో ఉపేంద్ర నటించాడు. ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ప్రతి హీరో అభిమాని ఇది తన స్టోరీ అనిపించేలా మూవీ తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
ఏంటి సాగర్.. ప్రింట్ రాకపోతే అద్దాలు పగలగొడతావ్.. కాలేజీలో గొడవలు పడతావ్.. టికెట్లు దొరక్కపోతే పరువుపోద్ది అంటావ్ అంటూ మూవీలో ఫిమేల్ లో లీడ్ రామ్ పాత్రతో మాట్లాడే మాటలతో ఈ ట్రైలర్ మొదలైంది. ఓ మాస్ అభిమానిలో ఉండాల్సిన అన్ని లక్షణాలతో సాగర్ పాత్రలో రామ్ పోతినేని ఒదిగిపోయాడు. అయితే హీరో కోసం ఏదైనా చేసే అభిమానులకు కొదవ లేదు. కానీ కష్టాల్లో ఉన్న తన అభిమాని కోసం ఓ హీరోనే కదిలి వస్తే.. ఆ సూర్య ఈ సాగర్ తో కలిస్తే అనే భిన్నమైన కథతో ఈ సినిమా రూపొందింది.
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ గురించి..
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను మజిలీ, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు పి. డైరెక్ట్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ మూవీని నిర్మిస్తోంది. వివేక్, మెర్విన్ మ్యూజిక్ అందించారు.
ఎ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అనే క్యాప్షన్ తోనే అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో నటించడంతోపాటు ఓ పాట రాసి పాడాడు రామ్ పోతినేని. ఇక భాగ్యశ్రీ, ఉపేంద్ర కీలకపాత్రలు పోషించారు. మూవీ ట్రైలర్ ఆంధ్రా కింగ్ తాలూకాపై అంచనాలు పెంచేసింది. చాలా రోజులుగా సక్సెస్ కోసం చూస్తున్న రామ్ పోతినేని ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


