అదిరిపోయే న్యూస్ చెప్పిన రామ్ పోతినేని- ఫ్యాన్స్ కు ఫుల్ జోష్- ఒక రోజు ముందుగానే ఆంధ్ర కింగ్ తాలూకా- కొత్త రిలీజ్ డేట్
రామ్ పోతినేని ఫ్యాన్స్ కు అదిరే న్యూస్. అతని అప్ కమింగ్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా ఒక రోజు ముందే థియేటర్లకు రానుంది. ఈ విషయాన్ని రామ్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు.
ఆంధ్ర కింగ్ తాలూకా.. వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఇది. ఈ సినిమాపై రామ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ మార్చారు. ఒక రోజు ముందే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి రామ్ పోతినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.

ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ డేట్
రామ్ పోతినేని అప్ కమింగ్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దీనికి మహేష్ బాబు.పి డైరెక్టర్. ఈ సినిమాను మొదట నవంబర్ 28న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చారు. ఒక రోజు ముందుగానే అంటే నవంబర్ 27న ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.
‘‘ఒక రోజు ముందుగానే కంటెంట్ ఇవ్వబోతున్న మహేష్ కు ధన్యవాదాలు. థ్యాంక్స్ గివింగ్ రోజు ఆంధ్ర కింగ్ తాలూకా మీ దగ్గరకు రాబోతుంది’’ అని రామ్ పోతినేని ఎక్స్ లో పోస్టు చేశాడు.
ట్రైలర్ ఆ రోజే
ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ ఇవాళ (నవంబర్ 16) అనౌన్స్ చేశారు. నవంబర్ 18న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘‘ఇదే టైమ్. సాగర్ లైఫ్ స్టోరీని త్వరలోనే చూసేందుకు రెడీగా ఉండండి. ఓ ఫ్యాన్ బయోపిక్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ నవంబర్ 18న రాబోతుంది’’ అని రామ్ పోతినేని ఎక్స్ లో పోస్టు చేశాడు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ తో పాటు స్పెషల్ డ్రోన్ షోను నవంబర్ 18న సాయంత్రం 5 గంటల నుంచి కర్నూల్ లోని ఔట్ డోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఫ్యాన్ బయోపిక్
ఓ హీరోను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్ బయోపిక్ గా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రాబోతుంది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆంధ్ర కింగ్ సూర్య క్యారెక్టర్ ను ఆయన పోషిస్తున్నారు. ఇందులో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, రిలీజైన పాటలు ఇప్పటికే మూవీపై హైప్ పెంచేశాయి. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


