లవ్‌లీ మ్యూజిక్, ఫ్రెష్ విజువల్స్, ఎమోషనల్‌గా ఉంది.. మరువ తరమా ట్రైలర్‌పై డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రివ్యూ

రష్మిక మందన్నాతో రొమాంటిక్ డ్రామాగా ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. అయితే, ఇవాళ విడుదలైన మరువ తరమా మూవీ ట్రైలర్‌పై రాహుల్ రవీంద్రన్ ప్రశంసలు కురిపించారు. మరువ తరమా ట్రైలర్ చాలా ఎమోషనల్‌గా ఉందని, సంగీతం లవ్‌లీగా ఉందంటూ రివ్యూ ఇచ్చారు.

Published on: Nov 24, 2025, 18:51:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెలుగులో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ మరువ తరమా. ఈ సినిమాలో హరీష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వాల ప్రధాన పాత్రలు పోషించారు. మరువ తరమా సినిమాకు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే చైతన్య వర్మ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.

లవ్‌లీ మ్యూజిక్, ఫ్రెష్ విజువల్స్, ఎమోషనల్‌గా ఉంది.. మరువ తరమా ట్రైలర్‌పై డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రివ్యూ
లవ్‌లీ మ్యూజిక్, ఫ్రెష్ విజువల్స్, ఎమోషనల్‌గా ఉంది.. మరువ తరమా ట్రైలర్‌పై డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రివ్యూ

మరువ తరువ నిర్మాతలు

మరువ తరమా చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్, వి విజయ్ కుమార్ రాజు నిర్మాతలుగా నిర్మించారు. నవంబర్ 28న థియేటర్లలో మరువ తరమా సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇప్పటికీ రిలీజ్ చేసిన ప్రమోషనల కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.

మూడు పాత్రల చుట్టూ

తాజాగా మరువ తరమ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మరువ తరమా ట్రైలర్ స్వచ్ఛమైన లవ్, ఎమోషనల్ సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమా మూడు పాత్రల చుట్టూ సాగుతుందని అర్థమవుతోంది. అయితే, మరువ తరమా ట్రైలర్‌ను చూసిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రశంసించారు.

రాహుల్ రవీంద్రన్ రివ్యూ

అంతేకాకుండా మరువ తరమా ట్రైలర్ ఎలా ఉందో రివ్యూ కూడా ఇచ్చారు. మరువ తరమా ట్రైలర్‌ను తాను చూశానని, లవ్‌లీ మ్యూజిక్, ఫ్రెష్ విజువల్స్‌తోపాటు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోందని హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెలిపారు. మరువ తరమా చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు రాహుల్ రవీంద్రన్.

హైలెట్‌గా బీజీఎమ్

డైరెక్టర్ చైతన్య వర్మ నడింపల్లిని సపోర్ట్ చేస్తూ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఇకపోతే మరువ తరమా ట్రైలర్‌లో విజయ్ బుల్గానిన్ బీజీఎమ్ హైలెట్‌గా నిలిచింది. లవ్ స్టోరీ చూస్తే రొటీన్‌గా అనిపించిన సంగీతం మాత్రం చాలా మంచి ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది.

చాలా కవితాత్మకంగా

మరువ తరమా ట్రైలర్ విషయానికొస్తే.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. అది ఎప్పుడు ఎలా మొదలవుతుందో తెలియదంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత సాగే లవ్ ట్రాక్‌ను చాలా పొయెటిక్‌గా చూపించారు. వర్షం, ప్రకృతి, వాటి మధ్యలో ప్రేమజంటతో మంచి అనుభూతిని ఇచ్చింది.

అదిరిపోయిన డైలాగ్

ప్రేమ రెండు అక్షరాల చిన్న మాట. పలకడానికి సులువుగానే ఉంటుంది. కానీ, దాంతో పడాలంటేనే చాలా కష్టం అని హీరోయిన్ చెప్పే డైలాగ్‌ డెప్త్ చూపిస్తూ హైలెట్‌గా నిలిచింది. సినిమాటోగ్రఫీ, విజివల్స్ బాగున్నాయి. మ్యాజిక్‌తో మ్యాజిక్ చేసేలా ఎమోషనల్ లవ్ స్టోరీగా మరువ తరమా సినిమాను డైరెక్టర్ చైతన్య వర్మ నడింపల్లి తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో

కాగా, నవంబర్ 28న మరువ తరమా మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుండగా.. నవంబర్ 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇటీవల రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా ది గర్ల్‌ఫ్రెండ్‌ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More