Sign in

12ఏ రైల్వే కాలనీ రివ్యూ.. జంట హత్యల కథతో అల్లరి నరేష్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకునేలా ఉందా?

అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 12ఏ రైల్వే కాలనీ. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు. అనిల్ విశ్వనాథ్ కథ అందించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి 12ఏ రైల్వే కాలనీ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Nov 21, 2025, 20:44:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: 12ఏ రైల్వే కాలనీ

12ఏ రైల్వే కాలనీ రివ్యూ.. జంట హత్యల కథతో అల్లరి నరేష్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకునేలా ఉందా?
12ఏ రైల్వే కాలనీ రివ్యూ.. జంట హత్యల కథతో అల్లరి నరేష్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకునేలా ఉందా?

నటీనటులు: అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, హర్ష చెముడు, గెటప్ శ్రీను, సద్దాం తదితరులు

కథ: అనిల్ విశ్వనాథ్

దర్శకత్వం: నాని కాసరగడ్డ

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: కుశేందర్ రమేష్ రెడ్డి

ఎడిటింగ్: నాని కాసరగడ్డ

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

విడుదల తేది: 21 నవంబర్, 2025

మంచి కమ్ బ్యాక్ హిట్ కొసం పరితపిస్తున్నాడు అల్లరి నరేష్. ఈ క్రమంలోనే అల్లరి నరేష్ చేసిన లేటెస్ట్ తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 12ఏ రైల్వే కాలనీ. పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు పొలిమేర చిత్రాల దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథ అందించడం విశేషం.

నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన 12ఏ రైల్వే కాలనీ సినిమా ఇవాళ (నవంబర్ 21) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి 12ఏ రైల్వే కాలనీ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

వరంగల్‌లోని రైల్వే కాలనీకి చెందిన కార్తీక్ (అల్లరి నరేష్) ఒక అనాథ. ఎమ్మెల్యే అవ్వాలని కసి మీద ఉన్న వరంగల్ టిల్లు (జీవన్ కుమార్)కు కార్తీక్, అతని ఫ్రెండ్స్ (హర్ష, గెటప్ శ్రీను, సద్దాం) అనుచరులు. అదే కాలనీలోని ఆరాధన (కామాక్షి భాస్కర్ల)తో కార్తీక్ ప్రేమలో పడతాడు. ఆరాధన మాత్రం కార్తీక్‌ను పట్టించుకోదు.

మరోవైపు ఎన్నికలకు 3 రోజుల ముందు కార్తీక్‌ను పిలిచి ఓ కవర్ ఇచ్చి ఓపెన్ చేయొద్దని, ఎవరికి తెలియకుండా దాచమని చెబుతాడు టిల్లు. అప్పుడే పోలీసులు వస్తున్నారని తెలిసి ఆరాధన ఇంట్లో కవర్ దాచేందుకు కార్తీక్ వెళ్తాడు. కానీ, అక్కడ ఆరాధనను, ఆమె తల్లిని దారుణంగా హత్య చేస్తారు.

ఇంట్రెస్టింగ్ ట్విస్టులు

ఆ హత్యలు చేసింది ఎవరు? అసలు ఆరాధన, తన తల్లిని ఎందుకు చంపారు? అది చేయించింది టిల్లునా? ఆరాధనను వెతుక్కుంటూ ముంబైలో ఉండే డాక్టర్ షిండే (అనీష్ కురువిల్లా) ఎందుకొచ్చాడు? అసలు ఆరాధన ఎవరు? ఈ జంట హత్యల కేసును ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రానా ప్రతాప్ (సాయి కుమార్) సాల్వ్ చేశాడా? ఈ కేసులోకి కార్తీక్ ఎందుకు దిగాడు? తెలియాలంటే ఈ 12ఏ రైల్వే కాలనీలోకి వెళ్లాల్సిందే.

విశ్లేషణ:

12ఏ రైల్వే కాలనీ మూవీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌గా చెందినది. సాధారణంగా ఇలాంటి జోనర్స్‌లో హత్యలు, వాటిని సాల్వ్ చేసేందుకు సాగే ప్రక్రియతో ఉంటాయి. అయితే, ఆ మర్డర్ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారనేదే ఆడియెన్స్‌కు థ్రిల్ల్, ఎగ్జైట్‌మెంట్ ఇచ్చే అంశాలు.

ఈ అంశాల్లో డైరెక్టర్ యావరేజ్ హిట్ కొట్టారని చెప్పొచ్చు. ఓహో అనేంతలా సీన్స్ లేవు. కానీ, మర్డర్ ఎలిమెంట్స్, ఆత్మ కనిపించడం, పొలిటికల్ అంశాలు, ముంబై బ్యాక్‌డ్రాప్‌తోపాటు మరోవైపు కేసు ఇన్వేస్టిగేషన్ వంటివి బాగానే చూపించారు. అయితే, వీటికి రన్‌టైమ్ ఎక్కువ అయిందనే ఫీలింగ్ కలిగింది.

సెకండాఫ్‌లో థ్రిల్లింగ్

సినిమాలోని అసలు కథ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటివరకు ఫస్టాఫ్ అంతా హీరో బిహేవియర్, వర్, హీరోయిన్‌తో లవ్ ట్రాక్ సీన్లతో సాగుతుంది. అది కాస్తా పర్వాలేదనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ఇన్వెస్టిగేషన్ థ్రిల్ పంచుతుంది.

కొన్ని చోట్ల సాగదీసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. కానీ, క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ ట్రాక్ బాగా రాసుకున్నారు. అందుకే అది వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఇకపోతే టెక్నికల్ వర్క్ బాగుంది. సాంకేతిక నిర్మాణాలు ఉన్నతంగా ఉన్నాయి.

క్లైమాక్స్ ట్విస్ట్‌తో కథ

సంగీతం పర్వాలేదు. బీజీఎమ్ బాగుంది. ఎడిటింగ్ మెరుగ్గా చేయాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఒక్క క్లైమాక్స్ ట్విస్ట్‌తో ఈ మూవీ స్టోరీ రాసినట్లుగా అనిపించింది. ఇక అల్లరి నరేష్ యాక్టింగ్ బాగుంది. సినిమాను ఒంటిచేత్తో నడిపించాడు.

ఓవరాల్‌గా చెప్పాలంటే

కామాక్షి భాస్కర్ల బాగా చేసింది. మిగతా పాత్రలు అన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే రొటీన్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 12ఏ రైల్వే కాలనీ.

రేటింగ్: 2.75/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More