బలగం తర్వాత మళ్లీ ఆ ఫీలింగ్ ఇచ్చిన సినిమా ఇదే, ఊర్లోకి వెళ్లినట్లుంది.. రచయిత, దర్శకుడు, నటుడు బీవీఎస్ రవి కామెంట్స్

రచయితగా, దర్శకుడిగా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు బీవీఎస్ రవి. హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ బీవీఎస్ రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బలగం తర్వాత అలాంటి ఫీలింగ్ ఇచ్చిన సినిమా ఇదేనన్నారు.

Published on: Nov 9, 2025, 10:49:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రచయితగా కెరీర్ స్టార్ట్ చేసిన బీవీఎస్ రవి తర్వాత దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా హీరో తిరువీర్ నటించిన రూరల్ బ్యాక్‌డ్రాప్ కామెడీ చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సక్సెస్ మీట్‌కు బీవీఎస్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బలగం తర్వాత మళ్లీ ఆ ఫీలింగ్ ఇచ్చిన సినిమా ఇదే, ఊర్లోకి వెళ్లినట్లుంది.. రచయిత, దర్శకుడు, నటుడు బీవీఎస్ రవి కామెంట్స్
బలగం తర్వాత మళ్లీ ఆ ఫీలింగ్ ఇచ్చిన సినిమా ఇదే, ఊర్లోకి వెళ్లినట్లుంది.. రచయిత, దర్శకుడు, నటుడు బీవీఎస్ రవి కామెంట్స్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టాక్

అయితే, టీనా శ్రావ్య హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సందీప్ అగరం, అష్మిక రెడ్డి కలిసి నిర్మించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ నవంబర్ 7న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో బ్లాక్ బస్టర్ ఫన్ షో

ఈ నేపథ్యంలోనే నవంబర్ 8న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో బ్లాక్ బస్టర్ ఫన్ షో అంటూ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన డైరెక్టర్ బీవీఎస్ రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిన్న చిత్రాలు బతకాలి అంటుంటారు

దర్శకుడు, రచయిత, నటుడు బీవీఎస్ రవి మాట్లాడుతూ .. "‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అనేది మీడియా సినిమా. చిన్న చిత్రాలు బతకాలి అని అంతా అంటుంటారు. మంచి చిత్రాన్ని అందరూ ముందుండి నడిపిస్తుంటారు. పెద్ద బ్యానర్స్ చిన్న చిత్రాల్ని సులభంగానే రిలీజ్ చేస్తారు. కానీ కొత్త, చిన్న నిర్మాతలు తీసే చిన్న సినిమాల్ని రిలీజ్ చేయడం కష్టం" అని అన్నారు.

ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి

"ఇలా అభిరుచి ఉన్న నిర్మాతల్ని ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. చిన్న చిత్రాలు ఆడితే కొత్త హీరోలు, దర్శకులకు అవకాశాలు వస్తాయి. తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ అందరూ అద్బుతంగా చేశారు. తిరువీర్‌ ఎంతో క్రమశిక్షణ ఉన్న నటుడు. ఎన్నో కష్టాలు పడి ఇంత స్థాయికి వచ్చాడు" అని బీవీఎస్ రవి తెలిపారు.

చాలా అవార్డులు వస్తాయి

"సినిమాకు వెళ్లినట్టుగా కాకుండా.. ఊర్లోకి వెళ్లినట్టు చూసినట్టుగా ఉంటుంది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ ఉంది. ‘బలగం’ తరువాత మళ్లీ ఆ ఫీలింగ్ ఇచ్చిన చిత్రమిదే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. ఈ మూవీకి చాలా అవార్డులు వస్తాయి" అని డైరెక్టర్ బీవీఎస్ రవి అభిప్రాయపడ్డారు.

సినిమాకు ప్రాణం పోస్తాడు

"సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీత దర్శకుడు. తన మ్యూజిక్‌తో సురేష్ బొబ్బిలి సినిమాకు ప్రాణం పోస్తాడు. రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశాడు. రెండో మూవీని కూడా సందీప్‌కే చేసి పెట్టు" అని రచయిత బీవీఎస్ రవి చెప్పుకొచ్చారు.

మీడియాకు నచ్చిన చిత్రం

"కొత్త నిర్మాతలు ఇలాంటి మంచి చిత్రాలు తీసినప్పుడు అందరూ చూసి సపోర్ట్ చేయండి. ఇది మీడియాకు నచ్చిన చిత్రం.. మీడియాకు నచ్చిందంటే ఆ సినిమా కచ్చితంగా బాగుంటుందని అర్థం" అని నటుడు బీవీఎస్ రవి వెల్లడించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More