ఒంటెద్దు బండిలా మూవీని ముందుకు తీసుకు వచ్చారు, ఒక్క నెగెటివ్ రివ్యూ లేదు: హీరో తిరువీర్‌పై డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్
హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా నవంబర్ 8న నిర్వహించిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్, టీనా శ్రావ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.
వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్ కామెడీ చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

సూపర్ హిట్ టాక్‌తో
కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం (నవంబర్ 8) నాడు బ్లాక్ బస్టర్ ఫన్ షోని చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్, టీనా శ్రావ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఒక్క నెగెటివ్ రివ్యూ లేకుండా
దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. "మీడియా లేకపోతే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈ స్థాయికి వచ్చేది కాదు. ఒక్క నెగెటివ్ రివ్యూ, కామెంట్ లేకుండా అందరూ ప్రశంసిస్తున్నారు. మీడియానే మా మూవీని ముందుకు తీసుకెళ్తోంది" అని అన్నారు.
ఇలాంటి కథలు ఆడవా
"తిరువీర్ అన్న, సందీప్ అన్న కోసం ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకున్నాను. ఒంటెద్దు బండిలా తిరువీర్ అన్న ఈ చిత్రాన్ని ముందుకు తీసుకు వచ్చారు. ఇలాంటి కథలు థియేటర్‌లో ఆడవా? అని అనుకున్నాను. కానీ, ఆడియెన్స్ మాత్రం మా సినిమాను పెద్ద సక్సెస్ చేశారు. ఇది సక్సెస్ అవ్వడంతో సహజత్వంతో కూడిన ఇలాంటి కథల్ని చేసేందుకు అందరూ ముందుకు వస్తారు" అని రాహుల్ శ్రీనివాస్ తెలిపారు.
అన్ని క్రాఫ్ట్‌లపై నాలెడ్జ్
"ఈ చిత్రంతో సందీప్ గారు అన్ని క్రాఫ్ట్‌ల మీద నాలెడ్జ్ పెంచుకున్నారు. శేఖర్ కెమెరా వర్క్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. అశ్విన్ సౌండ్ డిజైన్ బాగుందని మెచ్చుకుంటున్నారు. సనారే అయితే వెంటనే లిరిక్స్ ఇస్తుండేవారు. నరేష్ గారి ఎడిటింగ్ మా సినిమాకు చాలా హెల్ప్ అయింది. సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచింది" అని రాహుల్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
వంద శాతం కష్టపడి
"టీమ్ అంతా వంద శాతం ఇష్టపడి, కష్టపడి పని చేయడం వల్లే ఈ స్థాయి విజయం దక్కింది. మళ్లీ ఇదే కాంబోతో, ఇదే టీంతో మరో సినిమాను చేయాలని కోరుకుంటున్నాను. తనకు వచ్చిన అవకాశాన్ని తన శిష్యుడికి ఇచ్చిన నా గురువు గారు గురు కిరణ్‌కి థాంక్స్" అని డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ వెల్లడించారు.
ఎంత చెప్పిన తక్కువే
"‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి సపోర్ట్ చేస్తున్న మీడియాకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన డైరెక్షన్ టీంకు థాంక్స్. మా కోసం వచ్చిన బీవీఎస్ రవి సర్‌కు థాంక్స్. ప్రతీ సీన్‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మా మూవీని చూడని వాళ్లంతా చూడండి" అని హీరోయిన్ టీనా శ్రావ్య చెప్పుకొచ్చింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


